వయసు ప్రభావం వల్ల రాజకీయ జీవితం నుంచి విరమణ ప్రకటించడానికే ఎన్సీపీ అధినేత పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చాయి అయితే నాలుగు రోజులు గడవక ముందే ఆ రాజీనామాను వెనక్కి తీసుకొని ఆయన అందరికీ ట్విస్ట్ ఇచ్చారు .అసలు ఆయనకు రాజీనామా చేసే ఉద్దేశమే లేదని పార్టీలో తన బలం కొంతమందికి నిరూపించడం కోసమే ఆయన ఈ రాజీనామా అస్త్రం ప్రయోగించారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

గత కొంతకాలంగా మహారాష్ట్ర ఎన్నికలలో( Maharashtra elections ) కింగ్ మేకర్ గా ఉంటూ వస్తున్న శరద్ పవార్( Sharad Pawar )….భాజపా( BJP 0తో దూరం పాటిస్తూ ఎన్డీఏ యేతర కూటముల అధికారంలోకి రావడానికి ప్రణాళికలు రచించేవారు.మారుతున్న రాజకీయ సమీకరణాలను వేగంగా ఒడిసి పట్టుకునే స్వభావం ఉండడం వల్ల ఆయన రాజకీయంగా ఇంతకాలం విజయవంతమయ్యారు .ఇప్పటివరకు ఎన్డీఏ యేతర .రాజకీయాలు చేసిన ఆయన గత కొద్ది కాలంగా బిజెపితో సఖ్యత పాటిస్తున్నట్లుగా విశ్లేషణలు వచ్చాయి ….

అదాని కంపెనీ ల కుంభకోణం విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్ష కూటమి డిమాండ్ ను కూడా శరద్ పవార్ తోసివుచ్చిన విషయం తెలిసినదే .తద్వారా భారతీయ జనతా పార్టీతో ఆయన లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి .ఆయన నిర్ణయంతో ఎన్సీపీ చీలిపోతుందని , శివసేన( Shiv Sena ) తరహాలోనే ఎన్సీపీ కూడా మొక్కలైపోతుందంటూ కొంత మంది అభిప్రాయపడ్డారు ఆ వార్తలను తప్పని నిరూపించడానికి పార్టీలో తన పట్టును ప్రపంచానికి చూపించడానికే ఆయన రాజీనామా అస్త్రాన్ని వాడారని తెలుస్తోంది….వుయ్ స్టాండ్ విత్ సాహెబ్ అంటూ పోటెత్తిన కార్యకర్తలను చూస్తే పార్టీపై ఆయన పట్టును అర్థం చేసుకోవచ్చు ….

అందుకనే రెండుసార్లుపార్టీనిచీల్చడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీని ఆయన దానిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు.భవిష్యత్తులో భాజాపాకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా దానిని పార్టీలో ఎవరో వ్యతిరేకించకుండా ఉండేందుకు ముందుగానే పార్టీ క్యాడర్ను మానసికంగా సిద్ధం చేసేందుకే ఆయన రాజీనామా డ్రామా ఆడారని ఇప్పుడు కొత్తగా విశ్లేషణలు వస్తున్నాయిఆయన రాజీనామా అస్త్రం వ్యూహాత్మకమో కాదో మరి కొన్ని రోజుల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు బట్టి అంచన కు వచ్చే అవకాశం ఉంది.







