సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్కారు వారి పాట.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇటీవలే ఊర మాస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ అందుకుంటుంది.ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా నుండి ఇప్పుడు మరొక సాంగ్ వచ్చింది.సాంగ్ ప్రోమోతోనే అందరిని ఉర్రుతలూగించారు.
మహేష్ మాస్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.ఈ పూర్తి సాంగ్ ఈ రోజు రిలీజ్ చెయ్యనున్నారు.
అలాగే ఇప్పుడు అందరు నోటా ఒకటే మాట.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అని.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు గ్రాండ్ గా జరగనుంది.ఈ క్రమంలోనే మేకర్స్ మరొక పోస్టర్ వదిలారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కే ఎవరు గెస్ట్ గా రాబోతున్నారో కనిపెట్టండి అంటి ఒక పజిల్ వదిలారు.ముందు ఈ ఈవెంట్ కు ఒక స్పెషల్ గెస్ట్ ఎవరు లేరు అనే వార్త వినిపించింది.అయితే ఇప్పుడు మేకర్స్ పోస్టర్ వదలడంతో గెస్ట్ ఉన్నారు అని తెలుస్తుంది.అయితే ఆ గెస్ట్ ఎవరు అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు.ఇక ఇప్పుడు పోస్టర్ పెట్టి మరీ గెస్ట్ పై క్యూరియాసిటీ పెంచేశారు.మరి చూడాలి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు రాబోతున్నారో.







