ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఎట్టకేలకు జాయిన్ అయిన అలియా భట్

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ టైటిల్ రోల్స్ చేస్తున్నారు.

విప్లవ వీరులు అల్లూరి, కొమరామ్ భీం పాత్రలని ఈ సినిమా కోసం ఉపయోగించుకొని ఊహాజనితమైన స్టోరీని రాజమౌళి తెరపై ఆవిష్కరిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా శరవేగంగా సాగుతుంది.

ఇప్పటికే మెజారిటీ షూటింగ్ జరిగిపోయింది.హాలీవుడ్ నటులు కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు.

రీసెంట్ గా మహాబలిపురం ఫారెస్ట్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, హీరోయిన్ అలియా భట్ కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇప్పటికే అజయ్ దేవగన్ సినిమా షూటింగ్ లో పాల్గొని తన పాత్రకి సంబందించిన సన్నివేశాలు పూర్తి చేశాడు.

ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో అలియా భట్ జాయిన్ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే రాజమౌళి ఆమె షూటింగ్ షెడ్యూల్ ని అలా పొడిగిస్తూ వస్తున్నారు.తాజాగా అలియా భట్ కి సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో అలియా భట్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలియజేసింది.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ సెట్ నుంచి ఒక ఫోటో తీసుకొని దానిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలిపింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

దీంతో ఇన్ని రోజులు అలియా భట్ పై సోషల్ మీడియా వినిపించిన అన్ని రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది.

Advertisement

తాజా వార్తలు