ఉద్యోగుల జీతాల కోసం వినూత్నంగా నిరసన తెలిపిన ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ప్రపంచ వ్యాప్తంగా కార్మిక శక్తిని దోచుకునే పెట్టుబడిదారి వ్యవస్థ ఎప్పుడు ఉంటుంది.

వ్యాపార సంస్థలు కార్మికులకి కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా అతి తక్కువ వేతనంతో పనులు చేయించుకుంటూ ఎక్కువ వేతనం ఇస్తున్నట్లు చూపించి మోసం చేస్తూ ఉంటాయి.

ఇలాంటి మోసాలపై, కార్మికులకి కనీస వేతనాలు చెల్లించాలని ప్రతి చోట నిరసనలు తెలియజేస్తూ ఉంటారు.ఇండియా లాంటి దేశాలలో అయితే రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేస్తారు.

కాని అమెరికాలో న్యూయార్క్ లో పార్లమెంట్ సభ్యురాలు వినూత్నంగా కార్మికుల కోసం గొంతు విప్పే ప్రయత్నం చేసింది.న్యూయార్క్ పార్లమెంట్ సభ్యురాలు డెమొక్రాట్ నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ ఓ రెస్టారెంట్ లో సర్వర్ గా పని చేసింది.

ఆమె అలా చేయడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.ఆ రెస్టారెంట్లో ఆమె ఎందుకు పని చేస్తుంది అనే విషయం తెలుసుకుంటే రోజువారీ జీతానికి రెస్టారెంట్లు, సెలూన్లు, కార్‌వాషింగ్ సెంటర్ల వంటి సంస్థల్లో పనిచేసే వేలమంది కార్మికుల కోసం అని తెలిసింది.అమెరికాలో చాలా సంస్థలు రోజువారీ జీతానికి పనిచేసే కార్మికులకు గంటకి కేవలం 2.13 డాలర్లు మాత్రమే వేతనం ఇస్తున్నాయి.అక్కడ కనీస వేతనం 7.25 డాలర్లు ఇవ్వాలని రూల్ ఉన్న వారికి టిప్స్ వస్తాయనే సాకు చూపుతున్న కంపెనీలు ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వడంలేదు.ఇలా కార్మికులకి టిప్స్ వస్తాయనే శాకు చూపించి కనీస వేతనాలు చెల్లించకపోవడంపై ఆమె ఓ రెస్టారెంట్ లో సర్వర్ గా చేసి తన నిరసన తెలియజేసింది.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు