అమెరికా-భారత్ మధ్య ఎప్పటి నుంచో వాణిజ్య ఒప్పందం ఉంది.దీని ప్రకారం భారత్ నుంచి అమెరికాకి ఎగుమతి చేసే వస్తువుల మీద పన్ను ఉండదు.
పన్ను లేని కారణంగా వేల కోట్ల రూపాయిలు ఎగుమతులు అమెరికాకి ఇండియా నుంచి వెళ్తూ ఉన్నాయి.అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు భారత్ కి భారీ దెబ్బ తగిలింది.
భారత్ కి అమెరికా ఇచ్చిన ప్రాధాన్య వాణిజ్య హోదాను ట్రంప్ తాజాగా రద్దు చేసాడు.గత కొంత కాలంలో అమెరికా నుంచి ఇండియాకి దిగుమతి అయ్యే వస్తువులపై భారత్ భారీగా పన్ను వసూలు చేస్తుందని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు.
అయితే దీనిపై భారత్ ప్రభుత్వం చాలా సార్లు ఖండించింది.భారత ప్రజల ప్రయోజన కోసం తాము పన్ను వసూలు చేస్తున్నామని చెప్పుకొచ్చింది.అయితే భారత్ వాదనలతో విభేదించిన అమెరికా ప్రభుత్వం రెండు దేశాల మధ్య సమాన హేతుబద్దత ఉండాలని అంటుంది.అందుకే తాము భారత్ కి ఉన్న ప్రాధాన్య వాణిజ్య హోదాని రద్దు చేసినట్లు చెబుతుంది.
ఈ రద్దుతో అమెరికాకి ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై భారత్ ఇకపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.దీని వలన ఇండియాకి నష్టాలు ఉన్న కూడా వాణిజ్యం విషయంలో భారత్ తన జాతి ప్ యోజనాలకు పెద్ద పీట వేస్తుందని, భారత ప్రజలు ఉన్నత జీవణ ప్రామాణాలను ఆశిస్తున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
.






