అలర్ట్.. ఆ పదార్థాలు ఇచ్చిన డేట్ కంటే ముందే ఎక్స్ పైర్.

ప్రతి వస్తువుకు ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది.మనం వాడే ప్రతి వస్తువు మీద ఇది ఉంటుంది.

తినే ఫుడ్ ప్యాకెట్ దగ్గర నుంచి ఇంట్లో వాడే సరుకులు, మెడిసిన్స్, పాలు, పెరుగు.ఇలా ప్రతి ప్యాకెట్ పై ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది.

ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది.గడువు తేదీ నుంచి చూసిన తర్వాత మాత్రమే ఏ వస్తువునైనా కొనుగోలు చేయాలి.

గడువు తేదీ మరికొద్దిరోజుల్లో, లేదా ఎక్స్ పైరీ డేట్ పూర్తయిన వస్తువులను వాడకూడదు.ఎందుకంటే ఏ పదార్థం అయినా, మెడిసిన్ అయినా కొద్దిరోజులు మాత్రమే నిల్వ ఉంచి వాడుకోవచ్చు.

Advertisement

తర్వాత అవి పనికి రాకుండా పోతాయి.ఎక్స్ పైరీ డేట్ పూర్తయిన వాటిని వాడటం తర్వాత అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

ముఖ్యంగా తినే ఆహార పదార్థాల విషయంలో ఎక్స్ పైరీ డేట్ చూసుకోవాలి.ఎక్స్ పైరీ డేట్ పూర్తయిన వాటిని తినడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి.

కొన్ని పదార్థాలను ఎక్స్ పైరీ డేట్ కంటే ముందే పాడైపోతాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్. డైట్ పాటించేవారు వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా వీటిని తీసుకుంటారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
దీపావళి గిఫ్ట్‌తో తల్లిని సర్‌ప్రైజ్ చేసిన కొడుకు.. వీడియో చూస్తే ఫిదా..

వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయి.వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

Advertisement

మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది.డైట్ ను పాటించేవారితో పాటు హైబీపీ, మధుమేహం ఉన్నవారు కూడా ఓట్స్ తింటారు.అయితే ఓట్స్ ప్యాకెట్ పై ఉన్న ఎక్స్ పైరీ డేట్ కంటే ముందుగా అవి చెడిపోయే అవకాశముంది.

దీంతో ఓట్స్ కొన్న తర్వాత 4 నుంచి ఆరు నెలల్లోనే ఉపయోగించాలి.

అందుకే ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఓట్స్ ప్యాకెట్ కొనకూడదు.ఇక మైదా, గోధుమ పిండి, బియ్యం పిండి లాంటివి కూడా ఎక్కువ రోజులు వాడకూడదు.మూత పెట్టి గాలి వెళ్లకుండా ఉంచితే పిండి పదార్థాలు తొమ్మిది నెలల వరకు ఉంటాయి.

తర్వాత పురుగు పట్టి చెడిపోతాయి.దీంతో వెంటనే వాడేయటం మంచింది.

ఇక క్యాన్డ్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది.టిన్ లు, క్యాన్లలో భద్రపరిచిన ఆహారాలను ప్రజలు అధికంగా వాడుతూ ఉంటారు.

క్యాన్డ్ పుడ్స్ పై ఎక్స్ పైరీ తేదీని నమ్మకూడదు.అలాంటి వాటిని ఏడాదిలోపే వాడాలి.

తాజా వార్తలు