చాలా మంది తమ బంగారు వస్తువులను, ఆస్తి పత్రాలను భద్రపరచడానికి లాకర్లను ఉపయోగిస్తూ ఉంటారు.అయితే బ్యాంకులు లాకర్లను ఉపయోగించుకున్నందుకు కొంత అద్దె తీసుకుంటూ ఉంటాయి.
ఒక సంవత్సరానికి గాను లాకర్ సైజును బట్టి వివిధ బ్యాంకులు వివిధ రకాలుగా చార్జీలు వసూలు చేస్తూ ఉంటాయి.లాకర్ లకు సంబంధించిన అద్దె బ్యాంకుని బట్టి మారుతూ ఉంటుంది.
కొన్ని బ్యాంకులు అయితే ఏకంగా టర్మ్ డిపాజిట్ చేస్తేనే లాకర్లు కేటాయిస్తాయి.దీనికి తోడు లాకర్ తెరవాలంటే సవాలక్ష నిబంధనలు.
అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా భద్రతా బ్యాంకు లాకర్లను నిర్వహిస్తున్న తీరును సమీక్షించింది.ఇందుకు సంబంధించిన పాత నిబంధనలు మార్చి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకోచింది.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఖాతాదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఆర్బిఐ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది.అవి ఏంటో ఓ లుక్కేద్దాం.
లాకర్ కేటాయించడానికి చాలా బ్యాంకులు ఎంతోకొంత డౌన్ డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేస్తూ ఉంటాయి.లాకర్ కేటాయించగానే యాన్యువల్ చార్జీలు కూడా వసూలు చేస్తాయి.కానీ ఆర్బిఐ కొత్త రూల్స్ ప్రకారం బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తులకు లాకర్ కేటాయించాలంటే టర్మ్ డిపాజిట్ పై ఒత్తిడి చేయకూడదని ఆదేశించింది.ఒకవేళ లాకర్ అద్దెను అడ్వాన్స్ గా తీసుకుని ఉంటే.
ఆ మొత్తాన్ని తిరిగి ఖాతాదారులకు చెల్లించాలని తెలిపింది.లాకర్ కు అడ్వాన్సుగా ఎంత వసూలు చేశారో అంత మొత్తం తిరిగి వారికి చెల్లించాలని ఆర్బిఐ కొత్త రూల్స్ విడుదల చేసింది.
ఒకవేళ ప్రకృతి, విపత్తులు సంభవిస్తే సాధ్యమైనంత త్వరగా ఖాతాదారులకు తెలియజేసేందుకు బ్యాంకు సమగ్ర పాలసీతో ముందుకు రావాలని సూచించింది.
లాకర్ సిస్టం లాకర్ నిర్వహణ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్బిఐ బ్యాంకులకు సూచించింది.

ఒకవేళ లాకర్లు దొంగతనాలకు, దోపిడీలకు గురైతే వాటికి బాధ్యత బ్యాంకులే నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.భూకంపాలు వరదలు లాంటి ప్రకృతి విపత్తులు కారణంగా లాకర్ లకు నష్టం వాటిల్లితే బ్యాంకులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.అయితే ప్రకృతి విపత్తు నుంచి రక్షించుకునేందుకు బ్యాంకులు సరైన ఏర్పాటు చేసుకోవాలని కొత్త మార్గదర్శకాల్లో సూచించింది.అలాగే ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులను లాకర్లలో మార్చడానికి వీలు లేదని, అగ్ని ప్రమాదం, బిల్డింగ్ కూలిపోవడం వల్ల నష్టం వాటిల్లితే 100 రెట్లకు సమానమైన మొత్తాన్ని బాధితులకు చెల్లించాలని ఆర్బిఐ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది.