ఇద్దరు తెలియని వ్యక్తులు పెళ్లి అనే వివాహ బంధం తో ఒక్కటవుతారు.ఆ తర్వాత ఒకరి కోసం ఒకరు అనేంతగా బ్రతుకుతారు.
పెళ్లి ఇద్దరి మనుషులనే కాదు రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది.అంత అద్భుతమైన బంధం పెళ్లి.
పెళ్లి తర్వాత భర్త మీద భార్యకు.భార్య మీద భర్తకు ప్రేమ ఉండడం సహజం.
అది వివాహ బంధం యొక్క గొప్పతనం.
అయితే ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తికి మాత్రం భార్య అంటే అమితమైన ప్రేమ.
అది మాటల్లో వివరించలేక తన భార్యకు కానుక రూపంలో చూపించాడు.అంత అద్బుతమైన కానుక బహుశా ఏ భర్త ఏ భార్యకు ఇచ్చి ఉండరు.
ఇంతకీ అద్భుతం అంటున్నారు.కానుక ఏంటో చెప్పడం లేదు అని అనుకుంటున్నారా.
అక్కడికే వస్తున్నా.అతడు ఏం కనుక ఇచ్చాడో తెలియాలంటే మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.

ఆ పెద్దాయనకు భార్య అంటే చాలా చాలా ఇష్టం.తన వయసు మొత్తం సంపాదించడానికె సరిపోయింది.వ్యాపారాన్ని అభివృద్ధి చేసి తన పిల్లలకు భాద్యత అప్పజెప్పి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు 72 సంవత్సరాల పెద్దాయన.అయితే తన భార్యకు ఆక అద్బుతమైన కానుక ఇవ్వాలని అనుకున్నాడు.అయితే అందరిలా కాకుండా కొంచెం కొత్తగా ఉండాలని ఆలోచించాడు.

అందుకే ఒక ఇల్లును స్వయంగా నిర్మించాడు.ఆ ఇల్లు గోడలు గ్రీన్ కలర్ లో, పైకప్పు రెండ్ కలర్ లో అందంగా ఉండేలా తీర్చిదిద్దాడు.అంత స్పెషాలిటీ ఏంటా అని అనుకుంటున్నారా.
ఈ ఇల్లు ఉన్నచోటు నుండి 360 డిగ్రీల కోణంలో తిరగగల్గుతుంది.ఈ ఇల్లు ఎటు కావాలంటే అటు రివాల్వింగ్ చైర్ మాదిరిగా తిరుగుతుంది.
ఆ పెద్దాయన చదువు లేకపోయినా ఇంత బాగా ఆలోచించాడు.టెక్నాలిజీ పైన కూడా అవగాహన లేదు.
కానీ అంత అద్భుతంగా ఇల్లును నిర్మించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.







