టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందిందటే మన బ్యాంకులో ఉన్న డబ్బులు మనకి తెలియకుండానే ఇతరులు మాయం చేసేంతగా పెరిగిపోయింది.ఇలా ఆధినిక టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు.
వీరి వలలో అమాయకులే మాత్రమే కాదు అన్నీ తెలిసిన తెలివైన వారిని కూడా మోసం చేస్తున్నారు.ఈ క్రమములో ప్రముఖ టెలికం దిగ్గజం అయిన ఎయిర్ టెల్ తమ యూజర్లను అప్రమత్తం చేసింది.
సైబర్ నేరగాళ్ల విషయంలో ఎయిర్ టెల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలంటూ పలు సూచనలు చేసింది.ఎట్టి పరిస్థితులలో మీ ఫోన్ కి వచ్చిన అనుమానస్పద లింకులను ఓపెన్ చేయవద్దని సూచిస్తోంది.
ఇప్పుడు కొత్తగా వినియోగదారులకు కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలంటూ కొన్ని లింకులు ఎస్‌ఎంఎస్ రూపంలో ఎయిర్ టెల్ యూజర్ల ఫోన్ లకు వస్తున్నాయి.అయితే ఆ లింక్స్ ను నిజంగానే ఎయిర్ నుంచి వచ్చినవని పొరపాటుపడి వాటిని క్లిక్ చేసినట్లయితే అంతే సంగతులు.
నిమిషాల్లో మీ బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బులు అన్నీ ఖాళీ అవుతాయని తెలిపారు.

ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్లు కేవైసీ అప్‌డేట్ చేయకపోతే మీ మొబైల్ సర్వీసులు నిలిచిపోతాయని, మీ ఫోన్స్ కి మెసేజ్‌లు పంపి మిమ్మల్ని అయోమయంలో పడేస్తారు.ఆ కంగారులో వారు పంపిన లింక్స్ పై క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోతాయి.అందుకనే ఎయిర్‌టెల్ యూజర్లకు ఈ కేవైసీ విషయంలో హెచ్చరించిన ఫోటోను హైదరాబాద్ సిటీ పోలీసులు ట్వీట్ చేశారు.
అలాగే ఆన్ లైన్ ద్వారా ఎవరన్నా ఫోన్ కాల్ చేసి కేవైసీ అప్ డేట్ చేసుకోవాలంటూ మీ ఆధార్, ఓటీపీ వివరాలు అడిగితే మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి.ఇలాంటి మోసపూరిత లింక్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.