విజయనగరం జిల్లాలో తల్లి నాలుక కోసి హత్య చేసిన కసాయి కొడుకు..!

సమాజంలో మానవత్వానికి చోటు కరువైంది.ఎక్కడ చూసినా దారుణాలు, దోపిడీలు, హత్యలే.

 Alcohol Addicted Son Killed Mother In Vijayanagaram Details, Alcohol Addicted ,s-TeluguStop.com

కష్టపడి పని చేసే వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా తగ్గుతూ పోతోంది.కుటుంబ బాధ్యతలను మరిచి చెడు వ్యసనాల బారినపడి కుటుంబ సభ్యులనే అత్యంత దారుణంగా హత్యలు చేస్తున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

ఇలాంటి కోవలోని ఓ వ్యక్తి కుటుంబ బాధ్యతలను మరిచి మద్యానికి బానిసై డబ్బుల కోసం ఏకంగా నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కన్నతల్లి నాలుక కోసి హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లాలో( Vijayanagaram District ) చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Alcohol, Andhra Pradesh, Drunk Son, Son Mother, Srinivasa Rao, Vijayanaga

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.విజయనగరం జిల్లా రామభద్రపురం వసంతాల వీధిలో రమణమ్మ( Ramanamma ) అనే మహిళ కుటుంబం నివాసం ఉంటోంది.రమణమ్మ కుమారుడు అయిన శ్రీనివాసరావు( Srinivasa Rao ) తరచు మద్యం సేవించేవాడు.మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లి రమణమ్మను ప్రతిరోజు హింసించేవాడు.ఇలా ప్రతిరోజు రమణమ్మ ఇంట్లో ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉండేది.తాజాగా శ్రీనివాసరావు పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లి రమణమ్మ తో డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు.

Telugu Alcohol, Andhra Pradesh, Drunk Son, Son Mother, Srinivasa Rao, Vijayanaga

రమణమ్మ గట్టిగా శ్రీనివాసరావును మందలించడంతో క్షణికావేశంలో నవమోసాలు మోసిన తల్లి అని మైమరచి ఏకంగా తల్లి నాలుకను కోసి హత్య చేశాడు.హత్య చేసిన అనంతరం తల్లి నాలుక తో నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.జరిగింది విని పోలీసులే షాక్ అయ్యారు.కన్నతల్లినే కడతేర్చిన శ్రీనివాసరావును కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తల్లిని హత్య చేసిన పాపం ఊరికే పోదని గ్రామస్తులు శపిస్తున్నారు.పోలీసులు శ్రీనివాసరావును అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube