ఒక్క గ్లాస్ మందు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అనుకుంటున్నారా?.అయితే అలాంటి వారు తప్పనిసరిగ్గా తెలుసుకోవాల్సిన విషయం ఇది.
తరచుగా కొద్దిమొత్తంలో మద్యం తాగడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక పరిశోధనలో తేలింది.

సాధారణం కంటే గుండె కొట్టుకునే తీరులో మార్పులు వస్తాయని, దీని వల్ల గుండెపోటు కూడా వచ్చే ప్రమాదముందని పరిశోధకులు అంటున్నారు.గుంటె కొట్టుకునే వేగం పెరగడం వల్ల అలసట, కళ్లు తిరగడం, ఛాతీలో నొప్పి లాంటివి వస్తాయని చెబుతున్నారు.

అయితే ,రోజు కాకుండా.వారానికి ఒకసారి మాత్రమే తాగితే ఈ జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది.ఇక ఆల్కహాల్ రోజు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య కూడా వస్తుందని, ఇది చాలా ప్రమాదకరమని అంటున్నారు.