అల వైకుంఠపురములో ఫస్ట్ వీక్ కలెక్షన్లు.. రికార్డులకే రికార్డు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో బన్నీ బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్నాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుండటంతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.త్రివిక్రమ్ మార్క్ కథనంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుండటంతో అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

బన్నీ స్టైలిష్ యాక్టింగ్‌కు జనాలు నీరాజనాలు పడుతున్నారు.అటు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం పోటీలో ఉన్నప్పటికీ ఆ సినిమాను ఓవర్‌టేక్ చేసి మరీ ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది.

పూజా హెగ్డే అందాలు, థమన్ అందించిన సంగీతం కలగలిసి ఈ సినిమాను సంక్రాంతి విన్నర్‌గా నిలిపాయి.ఈ సినిమా మొదటి వారం పూర్తి చేసుకునే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.86.24 కోట్ల మేర వసూళ్లు సాధించింది.కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.108.08 కోట్లు కొల్లగొట్టింది.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 28.19 కోట్లు సీడెడ్ - 13.42 కోట్లు నెల్లూరు - 3.22 కోట్లు కృష్ణా - 6.48 కోట్లు గుంటూరు - 8.18 కోట్లు వైజాగ్ - 13.45 కోట్లు ఈస్ట్ - 7.09 కోట్లు వెస్ట్ - 6.21 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - రూ.86.24 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 8.89 కోట్లు ఓవర్సీస్ - 12.95 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ - రూ.108.08 కోట్లు.

Advertisement
బాబీ బాలయ్య తో చేస్తున్న సినిమా ఆ సూపర్ హిట్ సినిమాకి కాపీ గా రానుందా..?

తాజా వార్తలు