విష్ణు విశాల్ హీరోగా తమిళంలో తెరకెక్కిన రాచ్చసన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.సైకో థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.
ఇక సమాజం హేళనకి గురైన ఓ వ్యక్తి అమ్మాయిల పట్ల ఎలా కిరాతకంగా వ్యవహరించాడు అనే ఎలిమెంట్ తో ఈ సినిమా కథాంశం ఉంటుంది.ఇదిలా ఉంటే తమిళంలో తెరకెక్కి భారీ వసూళ్లు సొంతం చేసుకున్న ఈ మూవీని తెలుగులో కూడా రీమేక్ చేశారు.
రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు.అతని కెరియర్ లో చెప్పుకోదగ్గ సూపర్ హిట్ మూవీ అంటే ఇదే అని చెప్పాలి.
రాచ్చాసన్ తెలుగులో రాక్షసుడు టైటిల్ తో రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది.
బెల్లంకొండ తన గత సినిమాలకి భిన్నంగా చాలా సెటిల్ద్ గా రాక్షసుడు సినిమాలో నటించాడు.
ఇదిలా ఉంటే హవీష్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశాడు.
ఇక హిందీలో కూడా తానే రీమేక్ చేయాలని హవీష్ భావించాడు.అయితే కరోనా కారణంగా ముందుకి కదలలేదు.
ఈ నేపధ్యంలో అక్షయ్ కుమార్ ఈ మూవీ చూసి రీమేక్ హక్కులని హవీష్ నుంచి సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఈ మూవీని నిర్మించడంతో పాటు తానే నటించాలని అక్షయ్ కుమార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక త్వరలో దీనికి సంబందించిన ఇతర క్యాస్టింగ్, డైరెక్టర్ ఎవరనే విషయాలని తెలియజేసే అవకాశం ఉంది.ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ కి ఉన్న డిమాండ్ నేపధ్యంలో ఈ మూవీ కూడా కచ్చితంగా సూపర్ హిట్ అయ్యి అక్షయ్ కుమార్ కి భారీ లాభాలు తెచ్చి పెట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.