బంగార్రాజు విషయంలో నాగార్జున షాకింగ్ డెసిషన్.. ఏమిటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరో అయినటువంటి నాగార్జున ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ హీరోగా వరుసబెట్టి సినిమాలను చేస్తున్నారు.

నాగార్జున వరుస సినిమాలను చేస్తున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు సరైన హిట్ లేదని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే గతంలో వచ్చినటువంటి "ది వైల్డ్ డాగ్" పాజిటివ్ టాక్ సంపాదించుకొన్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేకపోయింది.ఈ క్రమంలోనే నాగార్జున నటించినటువంటి "సోగ్గాడే చిన్నినాయనా" సినిమా సీక్వెల్ గా "బంగార్రాజు" చిత్రం చేస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.తాజాగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఓ కీలక నిర్ణయాన్ని కింగ్ నాగార్జున తీసుకున్నట్టు తెలుస్తోంది.

మొదట్లో ఈ సినిమా షూటింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29వ తేదీ నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేశారు.అయితే ఈ సినిమాను అంతకంటే ముందుగా ఆగస్టు 16 అనగా సోమవారం నుంచి షూటింగ్ పనులను ప్రారంభించపోతున్నట్లు నాగార్జున తెలియజేశారు.

Advertisement

ఈ సినిమా షూటింగ్ నిమిత్తం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేశారని దాదాపు 50 శాతం షూటింగ్ ఇక్కడే పూర్తవుతుందని తెలియజేశారు.ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.అయితే ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్ అమీర్ ఖాన్  లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఖాళీగా ఉండటం చేత ఈ సినిమాను ముందుగా ప్రారంభించాలని భావించినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 16న ప్రారంభం కాబోయే ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకొని వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్నారు.

ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు