యూట్యూబ్ లో దూసుకెళ్తున్న నాగ్ ''నా సామిరంగ''.. ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయంటే?

అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) వచ్చే ఏడాది 2024 జనవరిలో పొంగల్ రేసుకు రాబోతున్న విషయం తెలిసిందే.మరి పొంగల్ రేసు మరొక 20 రోజులు మాత్రమే ఉండడంతో వరుస ప్రమోషన్స్ చేస్తూ ఆడియెన్స్ కు తమ సినిమాను రీచ్ అయ్యేలా మేకర్స్ కృషి చేస్తున్నారు.

 Akkineni Nagarjuna Naa Saami Ranga Teaser Hits 3 Million Views Details, Naa Saam-TeluguStop.com

నాగార్జున ”నా సామిరంగ” ( Naa Saami Ranga ) సినిమాతో సంక్రాంతికి గ్రాండ్ గా బరిలోకి దిగబోతున్నాడు.ఇప్పటికే షూట్ ఆల్మోస్ట్ పూర్తి చేయగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ అంత బిజీగా ఉన్నారు.

కాగా విజయ్ బన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మలయాళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ( Ashika Ranganath ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.మరి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా తాజాగా ఈ సినిమా నుండి టీజర్ (Naa Saami Ranga Teaser) ను రిలీజ్ చేసారు.

ఈ టీజర్ ఆడియెన్స్ ను బాగా అలరిస్తుంది.ఈసారి నాగ్ సంక్రాంతికి ( Sankranti ) మంచి విలేజ్ యాక్షన్ డ్రామా రెడీ చేస్తున్నట్టు టీజర్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది.ఇక ఈ టీజర్ యూట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసి దూసుకు పోతుంది.

ఇక నాగార్జున పొంగల్ రేసులో డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు.

కానీ అందరి కంటే ముందుగానే జనవరి 10 లేదంటే 11న వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.టీజర్ తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా సంక్రాంతి రేసులో పోటీ తట్టుకుని ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube