సూరి నిర్ణయంపై చాలా కోపంతో ఉన్న అక్కినేని ఫ్యాన్స్‌

సినిమా ఎంత బాగా తెరకెక్కించినా సరైన తేదీకి సరైన సమయంలో విడుదల చేయకుండా తప్పుడు తేదీలో విడుదల చేస్తే కచ్చితంగా నష్టం తప్పదు.తాజాగా సురేందర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Akkineni Fans Very Unhappy With Director Surendar Reddy Details, Agent , Akhil,-TeluguStop.com

అక్కినేని హీరో అఖిల్ తో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ఏజెంట్.ఈ సినిమా ను అనిల్ సుంకర నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది.అతి త్వరలోనే సినిమా వస్తుందని ఎదురు చూస్తున్న సమయం లో దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా ను సంక్రాంతి కానుకగా వచ్చే సంవత్సరం జనవరి లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

జనవరి లో అది కూడా సంక్రాంతి కానుకగా చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలు పోటీ పడబోతున్నాయి.అవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి.

ఇలాంటి సమయంలో సురేందర్ రెడ్డి ఎలా మా అక్కినేని హీరో అఖిల్ సినిమా ఏజెంట్ ని సంక్రాంతికి విడుదల చేస్తాడు అంటూ సురేందర్ రెడ్డి పై అసహనం వ్యక్తం చేస్తున్నాను.స్టార్ హీరోల సినిమాలకు పోటీ అంటే కచ్చితంగా అది రిస్క్ అన్నట్లుగానే ఉంటుంది.

Telugu Akhil, Akkineni Fans, Anil Sunkara, Surendar Reddy-Movie

సినిమా సక్సెస్ అయితే పర్వాలేదు.కానీ కాస్త అటు ఇటు అయినా డిజాస్టర్ కలెక్షన్స్ మూటకట్టుకోవాల్సి వస్తుంది.ఆ విషయం ఇటీవల దసరా సందర్భంగా విడుదలైన సినిమాలను చూస్తే అర్థమవుతుంది.అయినా కూడా సురేందర్‌ రెడ్డి సంక్రాంతికి ఆ పెద్ద హీరోల సినిమాతో విడుదల చేయడం అనేది అవివేకమైన నిర్ణయం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు మాత్రం ఏజెంట్ సినిమా పై ఉన్న నమ్మకంతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఇలా చేస్తున్నాడేమో, తప్పకుండా అఖిల్ కి సంక్రాంతి కానుకగా ఒక మంచి సక్సెస్ దక్కుతుందేమో అంటూ నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.ఏం జరుగుతుందో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube