మాజీ మంత్రి భూమ అఖిలప్రియ( Bhuma akhila priya ) రాజకీయ భవిష్యత్తు పూర్తిగా గందరగోళంలో పడిపోయింది.ఈ పరిస్థితికి కారణం ఆమె వ్యవహార శైలే.
ఇప్పటికే ఎన్నో వివాదాలు అఖిలప్రియను చుట్టుముట్టాయి.కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారంలో ఆమెపై అనేక కేసులు నమోదయ్యాయి.
తాజాగా లోకేష్ నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డి పైన లోకేష్ సమక్షంలో ఆమె అనుచరులు సుబ్బారెడ్డి పై దాడికి పాల్పడడం కలకలం రేపింది.ఈ వ్యవహారంలో భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేయడం, ఆమెకు కోర్టు రిమాండ్ విధించడం వంటివి జరిగాయి.
ఈ విషయంలో అఖిలప్రియదే తప్పని, ఆమె ఒక వ్యూహం ప్రకారం ఈ దాడి చేయించారనే ఆధారాలు బయటపడ్డాయి.ఇక ఈ వ్యవహారంపై టిడిపి అధినేత చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు.
పార్టీకి చెందిన కీలక నేత ఏవి సుబ్బారెడ్డి పై దాడికి పాల్పడడం, అది కూడా లోకేష్ పాదయాత్రలో చోటు చేసుకోవడంతో బాబు సీరియస్ అయ్యారట.

ఏవి సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఎప్పటి నుంచో సుబ్బారెడ్డికి అఖిలప్రియ కుటుంబానికి మధ్య సఖ్యత లేదు.ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.
ఇప్పుడు దాడుల వరకు వ్యవహారం వెళ్ళింది.దీంతో వచ్చే ఎన్నికల్లో టిడిపి టికెట్ దక్కుతుందా అనేది అనుమానంగానే మారింది.
అఖిలప్రియ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో( TDP chief Chandrababu ) పాటు, నారా లోకేష్ సైతం అసంతృప్తితో ఉండడంతో ఆమెకు సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదట.భూమా కుటుంబం కి ఆళ్లగడ్డ, నంద్యాలలో గట్టి పట్టు ఉన్నా.

అదంతా గతమని, ఇప్పుడు అఖిలప్రియ వ్యవహార శైలి కారణంగా జనాల్లోనూ ఆమె వర్గీయుల్లోనూ చులకన భావం ఏర్పడిందని, ఇవన్నీ ఆమెకు ఇబ్బందికరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది.ఇక టిడిపి( TDP) నిర్వహించిన సర్వేల్లోనూ అఖిల ప్రియకు గెలుపు అవకాశాలు అంతంత మాత్రమే అన్నట్టుగా తేలడంతో, అఖిల ప్రియ కు టిక్కెట్ ఇవ్వాలా వద్దా అనే విషయం చంద్రబాబు ఆలోచనలు పడ్డారట.