అఖిల్ సినిమాకు 3 కోట్లు డిమాండ్ చేస్తున్న మెగాస్టార్..!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఏజెంట్.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది.

ఈ సినిమాలో మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా నటిస్తారని తెలుస్తుంది.సినిమాలో ఆయనకు ఇంపార్టెంట్ రోల్ రాశారట సురేందర్ రెడ్డి.

సినిమాలో అఖిల్ కు ఈక్వల్ గా ఈ పాత్ర ఉంటుందని తెలుస్తుంది.ఇక ఈ రోల్ చేసేందుకు గాను మమ్ముట్టి 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.

మమ్ముట్టి లాంటి స్టార్ కావాలి అంటే అడిగినంత ఇచ్చేయాల్సిందే.అందుకే నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

Advertisement

అఖిల్ ప్రస్తుతం బ్యాచ్ లర్ సినిమా పూర్తి చేశాడు.ఆ సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

ఇక ఏజెంట్ సినిమాను కూడా ఈ డిసెంబర్ 24న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఏజెంట్ సినిమాలో అఖిల్ మాస్ లుక్ తో ఫ్యాన్స్ ను అలరిస్తాడని తెలుస్తుంది.

బ్యాచ్ లర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుండగా ఏజెంట్ మాత్రం ఫుల్ మాస్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.ఏజెంట్ సినిమా మీద అఖిల్ పూర్తి నమ్మకంగా ఉన్నాడని టాక్.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు