నాగార్జున పూజలు మళ్ళీ వర్కౌట్ అవ్వలేదా?

అక్కినేని యువ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) నటించిన లేటెస్ట్ మూవీ ”ఏజెంట్”.ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూసారు.

 Akhil Akkineni Agent Movie, Akhil Akkineni, Agent Movie, Agent, Nagarjuna, Suren-TeluguStop.com

అలాగే అఖిల్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకుని ఈ సినిమాను చేసాడు.ఈయన రెండేళ్ల కష్టంతో ఈ సినిమా చేసి భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

మరి ఎట్టకేలకు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ”ఏజెంట్” (Agent) సినిమా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ రిలీజ్ అయితే అయ్యింది కానీ.అక్కినేని హీరో ఖాతాలో మరో ప్లాప్ పడినట్టే అని చెప్పాలి.ఎందుకంటే మొదటి షోతోనే ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమాతో సురేందర్ రెడ్డి( Surender Reddy ) అఖిల్ కు మరో ప్లాప్ ఇచ్చాడు.ఇప్పటికే వరుస ప్లాపులతో అఖిల్ టాలెంట్ ఉన్న కూడా వెనుకబడి పోతున్నాడు.మళ్ళీ ఇప్పుడు కూడా ప్లాప్ రావడంతో నిరాశ చెందుతున్నారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా తనయుడు సినిమా కోసం నాగార్జున, అమల తిరుమల శ్రీవారిని సైతం దర్శించు కున్నారు.

గురువారం అక్కడ పూజలు చేసారు.అఖిల్ ఈ సినిమా కోసం నాగార్జున సపోర్ట్ ఏ మాత్రం తీసుకోలేదు.నాగ్ కూడా షూటింగ్ సమయంలో తొంగి కూడా చూడలేదు.అఖిల్ మీద భారం వేసి వదిలేసాడు.

అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది.కథ పరంగా ఏ మాత్రం దమ్ములేకుండా కేవలం హీరో పాత్ర మీదనే ద్రుష్టి పెట్టడంతో ఫెయిల్ అయ్యాడు.

అఖిల్ కాన్ఫిడెంట్ కూడా ఈ సినిమాకు పని చేయలేదు.అలాగే నాగార్జున (Nagarjuna) చేసిన పూజలు సైతం వర్కౌట్ అవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube