తండేల్ సినిమాకి పోటీ గా వస్తున్న తమిళ్ స్టార్ హీరో...ఈ పోటీలో ఎవరు సక్సెస్ కొడుతారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్యకి( Naga Chaitanya ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.

ఇక తను చేస్తున్న తండేల్ సినిమాని( Thandel Movie ) ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నిజానికైతే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సింది.కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా లేటవుతుంది.

మరి ఈ సినిమాతో పాటు తమిళ్ స్టార్ హీరో అయిన అజిత్( Ajith ) హీరోగా వస్తున్న పట్టుదల( Pattudala Movie ) అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది.మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి ప్రేక్షకులు పట్టం కడతారు.

తద్వారా ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

నాగచైతన్య వరుసగా డిజాస్టర్ల ని ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన బుజ్జి తల్లి అనే సాంగ్ మంచి పాపులారిటిని సంపాదించుకుంది.

అలాగే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.ఆయన అందించిన మ్యూజిక్ తో పాటు ఇతర సాంగ్స్ కూడా బాగున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే అటు చందు మొండేటి, ఇటు నాగ చైతన్య ఇద్దరు కూడా పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకున్న వాళ్ళు అవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అనేది అందరికీ చాలా ముఖ్యం అనే చెప్పాలి.

ఈ ఇయర్ లో మన స్టార్ హీరోలు సూపర్ సక్సెస్ లను అందుకుంటారా..?
Advertisement

తాజా వార్తలు