తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన వాలిమై తమిళ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.దీపావళికే ఈ సినిమా ను విడుదల చేయాలని భావించినా కూడా కరోనా కేసులు ఇతర విషయాల కారణంగా వాలిమై వాయిదా పడింది.
అజిత్ తో ఈ సినిమా లో తెలుగు హీరో కార్తికేయ ఢీ కొట్టబోతున్నాడు.ఆర్ ఎక్స్ 100 సినిమా తో సూపర్ హిట్ దక్కించుకుని తెలుగు లో మంచి సినిమా లు చేస్తున్న కార్తికేయ ఇప్పుడు తమిళంలో విలన్ గా నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.
వాలిమై గురించి తెలుగు వారు ఎక్కువగా మాట్లాడుకుంటున్న కారణంగా సినిమా ను తెలుగు లో కూడా విడుదల చేయాలని మేకర్స్ భావించారు.ఈమద్య కాలంలో అజిత్ సినిమా లను తెలుగు లో విడుదల చేయలేదు.
కారణం ఆయన సినిమా లు తెలుగు నాట పెద్దగా రాణించడం లేదు.

అందుకే తెలుగు ప్రేక్షకులు ఆయన సినిమా ను ఆధరించడం లేదు.కాని ఈసారి కార్తికేయ నటించడం వల్ల వాలిమై ను తెలుగు లో విడుదల చేయాలని భావించారు.వాలిమై ను తెలుగు లో బలం అనే టైటిల్ తో విడుదల చేయాలని భావించారు.
అందుకోసం పోస్టర్ ను కూడా విడుదల చేశారు.అయితే టైటిల్ దొరకలేదో లేదంటే బలం టైటిల్ రీచ్ అవ్వడం లేదు అనుకున్నారో కాని మళ్లి వాలిమై టైటిల్ తోనే తెలుగు లో కూడా విడుదల చేస్తామని ప్రకటించారు.
వాలిమై అంటూ తెలుగు పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.వాలిమై అంటే అర్థం ఏంటో తెలుగు ప్రేక్షకులకు తెలియదు.
అది ఏంటీ అనే విషయాన్ని పోస్టర్ లో అయినా వేయాలి.వాలిమై కు అర్థం బలం.కనుక వాలిమై టైటిల్ కింద బలం అంటూ సబ్ టైటిల్ మాదిరిగా వేస్తే అర్థం అవుతుంది.కాని వాలిమై చూడండి అంటే అసలు టైటిల్ అర్థం తెలియకుండా ఎలా చూస్తాం రా బాబు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.