పుష్పరాజ్ అన్నగా అజయ్..పోలీస్ ఆఫీసర్ పాత్రలో..!

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఏవైటెడ్ చిత్రాల్లో పుష్ప ఒకటి.

ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు.

మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో పుష్ప రాజ్ గా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.ఈ సినిమాలో టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరొక ప్లస్ అనే చెప్పాలి.

Advertisement
Ajay As Pushparaj Brother In Allu Arjun Pushpa Movie Update, Pushpa, Allu Arjun,

అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.

Ajay As Pushparaj Brother In Allu Arjun Pushpa Movie Update, Pushpa, Allu Arjun,

ఈ సినిమా మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరుతొ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ మధ్యనే వచ్చిన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.విడుదల అయిన ఐదు భాషల్లో రికార్డ్ వ్యూస్ తో సంచలనం సృష్టించింది.

ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఇందులో నటించే నటీనటులు అన్ని ఇండస్ట్రీల నుండి తీసుకున్నారు.

Ajay As Pushparaj Brother In Allu Arjun Pushpa Movie Update, Pushpa, Allu Arjun,

తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమాలో పాపులర్ యాక్టర్ అజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తుంది.పుష్పరాజ్ అన్న పాత్రలో అజయ్ కనిపించ బోతున్నాడని తెలుస్తుంది.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

అది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్ర అని టాక్.మరి అజయ్ పాత్ర ఈ సినిమాలో నెగిటివ్ గా ఉంటుందో.

Advertisement

లేదంటే పాజిటివ్ గా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

తాజా వార్తలు