తెలుగు సినిమాలకు దూరంగా ఐశ్వర్య రాజేష్... అసలు కారణం చెప్పిన నటి!

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌(Aishwarya Rajesh) తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం తెలుగు సినిమాలకు దూరమయ్యారు.

ఇలా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

తాజాగా ఐశ్వర్య రాజేష్ నటించిన తాజా చిత్రం ఫర్హాన్.ఈ సినిమా మే 12వ తేదీ తెలుగు హిందీ తమిళ భాషలలో విడుదల కానున్న నేపథ్యంలో ఈమె హైదరాబాద్లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తనకు పలు సందర్భాలలో తెలుగులో నటించకపోవడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయని తెలిపారు.అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు తెలుగులో అవకాశాలు రాకపోవడం వల్లే తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమిళ సినిమాలలో నటిస్తున్నానని తెలియజేశారు.తెలుగులో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఆ పాత్రలు తనుకు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసానని తెలిపారు.

తాను ఏదైనా ఒక పాత్రలో నటిస్తున్నాను అంటే ఆ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తానని, రెగ్యులర్ పాత్రలు కాకుండా స్పెషల్ పాత్రలలో నటించాలని తనకి ఉందని అందుకే కొన్ని అవకాశాలను కూడా వదులుకున్నానని ఈమె తెలియజేశారు.తాను ఏ సినిమా చేసిన అది స్పెషల్ గా ఉండాలని ఈమె ఆకాంక్షించారు.తన పాత్రకు ప్రయారిటీ లేకపోతే తాను నటించలేనని అందుకే వచ్చిన అవకాశాలను కూడా తాను వదులుకున్నానని, అందుకే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నానని ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

తాజా వార్తలు