రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రం మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.
దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటిని కూడా తూడ్చి పెడుతుందనే నమ్మకం చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్ సినిమాలకు సైతం సాధ్యం కాని మూడు వేల కోట్ల రూపాయల వసూళ్లను ఈ చిత్రం దక్కించుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.
ఇంతటి భారీ సినిమాలో ప్రతి విషయాన్ని కూడా చాలా డెప్త్‌గా ఆలోచించి శంకర్ చేశాడు.ఇక ఈ చిత్రం స్థాయి పెంచేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘రోబో’ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే.ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంలో ఐశ్వర్య రాయ్ కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అద్బుతమైన తన అందంతో సినిమాకు ప్లస్ అయ్యింది.రోబోకు సీక్వెల్ అన్నప్పుడు 2.ఓ లో కూడా ఆమె ఉండాల్సిందే కదా, అందుకే శంకర్ ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్‌ని కొన్ని నిమిషాల పాటు చూపించబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అదే కనుక నిజం అయితే సినిమా స్థాయి ఇంకాస్త పెరడగం ఖాయం అంటున్నారు.

ఐశ్వర్యరాయ్‌కి ఉన్న క్రేజ్ ఏ స్థాయిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.నాుగు పదుల వయసులో కూడా ఆమె యావత్ దేశంలోని సినీ అభిమానుల అభిమానం పొందుతుంది.అలాంటి ఐశ్వర్య రాయ్ 2.ఓ చిత్రంలో ఉంటే రచ్చ రచ్చ అంటున్నారు.కనీసం పది నిమిషాలు ఆమె కనిపించినా కూడా అదనంగా 50 కోట్లు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు రహస్యంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సినిమా విడుదలైన తర్వాత ఈ విషయమై క్లారిటీ వస్తుందేమో చూడాలి.