తెలంగాణ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన అసెంబ్లీ స్థానం ఏదైనా ఉందంటే అది కూకట్పల్లి నియోజకవర్గమని చెప్పడంలో సందేహం లేదు.చివరికి రేవంత్ రెడ్డి కొడంగల్ స్థానం కంటే కూడా ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిన సీటు కేవలం కూకట్పల్లి అసెంబ్లీ స్థానమే.
నందమూరి సుహాసిని గా చెప్పబడుతున్న చుండ్రు సుహాసిని విజయం సాధిస్తుందా లేక టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందా అనేది ప్రస్తుతానికి అతి పెద్ద సవాల్గా మారింది.స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి , కెసిఆర్ నాయకత్వం ఒక వైపు ఉంటే.
మరోపక్క తెలుగు కూడా సరిగ్గా పలకడం రాని, రాజకీయాల్లో అనుభవం లేని చుండ్రు సుహాసిని, కేవలం హరికృష్ణ సెంటిమెంట్, నందమూరి బ్యాక్ గ్రౌండ్ లో పోటీలోకి దిగుతోంది.ఇదిలాఉంటే
కూకట్పల్లిలో టిఆర్ఎస్ టీడీపీ లతోపాటు బిజెపి కూడా పోటీలో నిలవడం తో మరింత ఇప్పుతూ సర్వత్రా ఉత్ఖంట నెలకొంది ఎందుకంటే ఆ పార్టీ తరఫున నందమూరి తారక రామారావు కూతురు పురంధరేశ్వరి ప్రచారం చేయడమే అందుకు ప్రధాన కారణం.చుండు సుహాసిని నందమూరి సుహాసిని గా నెత్తిన పెడుతున్న పచ్చ మీడియా ఇప్పుడు అసలు సిసలైన నందమూరి మొదటి మహిళా రాజకీయ వారసురాలు పురందరేశ్వరి రావడం, బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల్లో ప్రచారం చేయడం బాబుకు దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది.దాంతో కూకట్పల్లి స్థానం అత్త కోడల కు సవాల్ గా నిలుస్తోంది.
అయితే ఇప్పటికే పురందరేశ్వరి మల్కాజ్గిరి స్థానంలో నిలబడిన బిజెపి అభ్యర్థి రామచంద్రరావు తరపున ప్రచారం చేశారు.ఆ సమయంలో మాట్లాడుతూ మహా కూటమిని ,టిఆర్ఎస్ పార్టీలని లో మట్టి కరిపించాలని , అనైతికంగా ఏర్పడిన మహాకూటమికి అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్ కి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని పురందరేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు…మల్కాజిగిరిలో ఆమె చేసిన ప్రచారం ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా చేస్తోంది.
నాలుగున్నర ఏళ్ల పాలనలో మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని డబుల్ బెడ్ రూమ్ పథకం కింద 1170 కోట్లు స్వచ్ఛత కోసం 100 కోట్లు ఇచ్చిన ప్రజలకు టిఆర్ఎస్ చేరువ చేయలేకపోయిందని ఫైర్ అయ్యారు పురంధరేశ్వరి అయితే ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు జవాబుగా సుహాసిని నా మేనకోడలు అయిన పార్టీపరంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత నాపై ఉందని సుహాసిని పై పోరు తప్పదన్నట్లుగా సమాధానం చెప్పారు.దాంతో అత్తా కోడళ్ళ మధ్య బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు విశ్లేషకులు.