కొత్త లుక్‌లోకి మారిపోయిన ఎయిరిండియా విమానాలు.. కారణమిదే?

అవును, మీరు విన్నది నిజమే.ఎయిరిండియా విమానాల రూపురేఖలు మారిపోనున్నాయి.

 Air India Planes That Have Changed Into A New Look What Is The Reason , Air Ind-TeluguStop.com

ఎయిరిండియాను టాటా సన్స్‌ ఆధీనంలోకి తీసుకున్నాక కొత్తగా వాటికి మెరుగులు దిద్దుతున్నారు.ఈ క్రమంలోని ఎయిరిండియా లోగో తో పాటు విమానాల షేపులు కొద్ది కొద్దిగా మారిపోనున్నట్టు తెలుస్తోంది.

ఎయిరిండియా విమానయాన సంస్థ అభివృద్ధిలో భాగంగానే ఆయా మార్పులు చేస్తున్నట్లు టాటా గ్రూప్‌( Tata Group ) వెల్లడించింది.ఎయిరిండియా విమానంలో మార్పులు చేసిన తర్వాత నయా లుక్‌కు సంబంధించిన ఫొటోలను టాటా గ్రూప్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకోవడంతో ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

అవును, టాటా గ్రూప్‌ ఎయిరిండియా లోగో, ఎయిర్‌క్రాఫ్ట్‌ లివరీలో మార్పులు చేసింది. ఫ్రాన్స్‌ లోని టౌలోసి వర్క్‌ షాపులో కొత్త లోగో, డిజైన్‌తో తీర్చిదిద్దిన ఏ350 విమానం ఫొటోలను ఎయిరిండియా తన అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో షేర్‌ చేసింది.త్వరలో ఏ350 విమానాలను భారత్‌కు తీసుకొస్తున్నట్లు ఎయిరిండియా విమానయాన సంస్థ తెలిపింది.కాగా.కొత్త లుక్‌లో ఉన్న ఎయిరిండియా విమానాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ కావడం గమనార్హం.కాగా.

ద విస్టాగా వ్యవహరించే కొత్త లోగోలో పసిడి వన్నె మహారాజా మస్కట్ విండో ఫ్రేమ్‌ను ఉంచారు.

అంతేకాకుండా, లోగోలో ఎయిరిండియా అక్షరాల రూపురేఖలను కూడా మార్చివేయడం జరిగింది.తమ పాత విమానాలన్నింటినీ కూడా ఈ కొత్త డిజైన్‌లోకి మార్చనున్నట్లు ఎయిరిండియా అధికారికంగా తెలిపింది.ఇందుకోసం ఏకంగా 400 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇక 2023 డిసెంబర్‌ నాటికి కొత్త లోగోతో ఉన్న కొన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎయిరిండియా సంస్థ ఈ సందర్బంగా ప్రకటించింది.2025 నాటికి ఎయిరిండియాలోని అన్ని విమానాలకు కొత్త లోగోను అమర్చనున్నట్లు కూడా ప్రకటించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube