ప్రవాస భారతీయులకు ఎయిర్ ఇండియా భంపర్ ఆఫర్ ప్రకటించింది, ఈ ఆఫర్ కూడా కేవలం యూఏఈ లోని ప్రవాస భారతీయులకు మాత్రమేనట.ఇంతకీ ఏమిటా ఆఫర్, ఎయిర్ ఇండియా ఎందుకు ఉన్న ఫళంగా ఈ భారీ ఆఫర్ ను ప్రకటించడం అంటే.
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూఏఈ లో ఉన్న ప్రవాసులు అతి తక్కువ ధరకు భారత్ వచ్చేలా అవకాశం ఇచ్చింది.ఇది కేవలం యూఎఈ నుంచీ వచ్చే ప్రవాసులకు మాత్రమే.
ఎయిర్ ఇండియా ఇచ్చిన ఆఫర్ లను పరిశీలిస్తే.
యూఎఈ నుంచీ భారత్ లోని ముంబై, ఢిల్లీ , చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్ళే వారికి వన్ వే టిక్కెట్టు ధర రూ.7145 గా నిర్ణయించింది.ఒమన్ దేశం మినహాయించి యూఎఈ లోని అన్ని దేశాలనుంచీ భారత్ లోని ఏ ప్రాంతానికైనా సరే కళ్ళు చెదిరే ఆఫర్లు ప్రకటించింది.
అంతేకాదు అక్టోబర్ 15 -2022 వరకూ విక్రయించే అన్ని టిక్కెట్లపై లగేజీ చార్జీలపై కూడా ఆఫర్ అందుబాటులో ఉంచింది.చెక్ ఇన్ బ్యాగేజ్ అలవెన్స్ ను 35 కిలోలు, 8 కిలోల హ్యాండ్ లగేజ్ కూడా తీసుకువెళ్ళేందుకు అనుమతులు ఇచ్చింది.

కువైట్ నుంచీ చెన్నై వెళ్ళే వారికి 36.65 kwd గా ధరను నిర్ణయించగా, కువైట్ నుంచీ ముంబై వెళ్ళే వారికి కూడా ఇదే ధరను నిర్ణయించింది.ఇక బహ్రయిన్ నుంచీ ఢిల్లీ కి వెళ్ళే వారు 60.3 BHD చెల్లించితే చాలు, ఇక దుబాయి నుంచీ – కొచ్చి, గోవా, హైదరబాద్, బెంగుళూరు, ఇండోర్, చెన్నై వంటి పలు కీలక నగరాలు ఎక్కడికైనా సరే 330 దిర్హమ్స్ గా ప్రకటించింది.అలాగే మస్కట్ నుంచీ ముంబై , హైదరాబాద్ వెళ్లేవారికి విమాన టిక్కెట్టు ధర 43.1 OMR గా నిర్దారించాగా, మస్కట్ నుంచీ ఢిల్లీ చెన్నై వెళ్ళే వారు 65.1 OMR చెల్లించితే చాలని తెలిపింది.ఈ క్రమంలో ఎయిర్ ఇండియా సీనియర్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎయిర్ ఇండియా తో పాటు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలలో కలిపి మొత్తం 81 వేల సీట్లు అందుబాటులో ఉంచుతున్నట్టుగా తెలిపారు.







