నెమలికి నేర్పిన నడకలివి అని ఆనాడు పాడిన, రా రా రమంటున్న రణరంగంలో సిద్దంగున్నా చావో రేవో తేలాలిపుడే డాన్స్ అని ఈ మధ్య పాడినా, డాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్ బయటికొస్తారు.మరి మీలో ఎవరైనా అలాంటి డ్యాన్సర్ ఉంటే, ఆ ప్రతిభ మీకుంటే ఆహా, ఓక్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి సమర్పిస్తున్న ‘డాన్స్ ఐకాన్’ అనే షో మీ కోసమే.
మీ ప్రతిభకు మా వేదిక శిరస్సు వంచి ఆహ్వానిస్తుంది.ఇంకా ఎందుకు ఆలస్యం, ఆడిషన్స్ ఇచ్చేయండి, డాన్స్ ఐకాన్ టైటిల్ ను గెలుచుకోండి.
జూన్ 22 నుండి ప్రారంభం కానున్న ఈ షో యొక్క డిజిటల్ ఆడిషన్స్ జులై 10 వరకు కొనసాగుతాయి.మీ వయస్సు 5 నుండి 50 మధ్యలో ఉన్నట్టయితే, మీరు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారైతే, మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. [email protected] అనే ఈమెయిల్ కు, 60 సెకండ్స్ మీ డాన్స్ వీడియోని మెయిల్ చేయండి







