తెలుగు ఓటిటి రంగంలో ఆహా అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది.ఇంతగా ఆహా ఓటిటి రంగంలో క్లిక్ కావటానికి ప్రధాన కారణం.“అన్ స్టాపబుల్” షో అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.బాలకృష్ణ హోస్ట్ గా షోకీ వచ్చే వచ్చే సినిమా సెలబ్రిటీలను రాజకీయ నేతలను తనదైనశైలిలో అడిగే ప్రశ్నలు చూసే వీక్షకులకు ఎంతగానో షోపై ఇంట్రెస్ట్ కలిగించేలా చేశాయి.

దీంతో దేశంలో ఓటీటీ రంగంలో అన్ని టాకీ షోలలో “అన్ స్టాపబుల్” షో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే ఇప్పుడు “అన్ స్టాపబుల్” షోకి పోటీగా సోనీ లీవ్ ఓటిటీ ప్లాట్ ఫామ్ “నిజం విత్ స్మిత” పేరుతో ఓషో స్టార్ట్ చేయడం జరిగింది.ఈ షోకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, నాని, రానా, సాయి పల్లవి, అడవి శేష్ తదితరులు షోలో పాల్గొన్నారు.ఫిబ్రవరి 10వ తారీఖు నుండి ఈ షో స్ట్రీమింగ్ కానుంది.
మరి Sony LIV “నిజం విత్ స్మికీ షో ఆహా “అన్ స్టాపబుల్” షోకీ ఎంత మేర పోటీ ఇస్తుందో చూడాలి.
