వరి పంటలో అధిక దిగుబడి కోసం వ్యవసాయ క్షేత్ర నిపుణుల సూచనలు..!

తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పంటలలో వరి( Paddy ) అగ్రస్థానంలో ఉంది.వరి సాగు చేయడం వల్ల అన్నం, పశువుల గడ్డి, తవుడు లభించడం వల్ల మార్కెట్లో వారికి ఎప్పుడూ మంచి డిమాండే ఉంటుంది.

 Agricultural Experts Suggestions For High Yield In Paddy Crop Details, Agricultu-TeluguStop.com

ప్రస్తుతం పెరుగుతున్న జనాభాగు సరిపడ్డ ఆహారాన్ని అందించాలంటే వరిలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉత్పాదకతను బాగా పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.వ్యవసాయ క్షేత్ర నిపుణుల సూచనలను పాటిస్తే 25% అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.

వరి పంటలో కీలకం వరి నాటేటప్పుడు నాలుగు నుండి ఆరు ఆకులు కలిగి ఉన్న సుమారుగా 80 రోజుల వయసున్న నారును( Paddy Seeding ) ఎంపిక చేసుకుని, నాటేటప్పుడు నారు తలలు తుంచి నాటాలి.ఇలా తలలు తుంచడం వల్ల చీడ పీడల బెడద తగ్గుతుంది.

దీర్ఘకాలిక రకాలు అయితే ఒక చదరపు మీటరుకు 38 కుదుళ్ళు, మధ్యకాలిక రకాలు అయితే ఒక చదరపు మీటరుకు 44 కుదుళ్ళు, స్వల్పకాలిక రకాలు అయితే ఒక చదరపు మీటరుకు 50 కుదుళ్ళు ఉండే విధంగా నాటాలి.

Telugu Agricultural, Agriculture, Techniques, Fertilizers, Yield Paddy, Paddy Cr

ప్రతి ఆరు అడుగులకు 20సెం.మీ ల దారులు విడిచినట్లయితే సూర్యరశ్మి, గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.పొలానికి ఎరువులు( Fertilizers ) అందించే సమయంలో నీరు పలుచగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

పొలంలో ఏవైనా గులికలు వేసేటప్పుడు రెండు అంగుళాల మేర నీరు ఉండేటట్లు జాగ్రత్త పడాలి.గులికలను ఎట్టి పరిస్థితులలో కూడా ఎరువులతో కలిపి చల్లరాదు.గులికలను ఇసుకతో కలిపి చల్లాలి.

Telugu Agricultural, Agriculture, Techniques, Fertilizers, Yield Paddy, Paddy Cr

మొక్కలు గిడసబారి పిలకలు ఎక్కువగా వచ్చి, ముదురు ఆకులతో చివర తుప్పురంగు మచ్చలు కనపడితే జింక్( Zinc ) లోపం ఉన్నటే.రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ను ఒక లీటర్ నీటిలో కలిపి మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.భాస్వరం మోతాదుకు మించి వాడినట్లయితే జింక్ లోపం అధికంగా కనిపిస్తుంది.

కాబట్టి తక్కువ మోతాదులో భాస్వరం ఎరువులు పొలానికి అందించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube