బిగ్‌ బాస్‌ ఇదేం బాగాలేదయ్యా... అతడికి సింపతీ ఖాయం

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 7( Biggboss season 7 ) ని ఆసక్తికరంగా మార్చేందుకు నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.అయిదు వారాలు పూర్తి అయిన తర్వాత వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటూ అయిదుగురు కొత్త వారిని ఇంట్లోకి పట్టుకు వచ్చారు.

 Telugu Biggboss Season 7 Pllavi Prashanth Issue , Biggboss Season 7 , Pllavi-TeluguStop.com

ఇప్పటి వరకు బిగ్‌ బాస్ చరిత్రలో ఇలా కాలేదు.మొత్తానికి బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు అనడంలో సందేహం లేదు.

ఇప్పుడు తెలుగు బిగ్‌ బాస్ లో ఆసక్తికర పరిణామం చేసుకుంది.పల్లవి ప్రశాంత్‌ బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ గా నిలిచాడు.

ఆయన మాట ఎవరు వినక పోవడంతో బిగ్ బాస్ ( Biggboss )ఆయన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడం జరిగింది.

Telugu Bb Season, Biggboss, Biggboss Season, Nagarjuna, Tollywood-Movie

దాంతో కెప్టెన్ గా కొన్ని రోజుల్లోనే.అది కూడా ఇంకా కొన్ని రోజుల ఛాన్స్ ఉండగానే కెప్టెన్ గా ఉండే అర్హత నీకు లేదు అన్నట్లుగా బిగ్‌ బాస్‌ కామెంట్స్ చేయడం తో అంతా కూడా అవాక్కయ్యారు.అంతుకు ముందు ఇంటి సభ్యులు అంతా కూడా పల్లవి ప్రశాంత్‌ కెప్టెన్ గా ఫెయిల్‌ అయ్యాడు అంటూ ఓటు వేశారు.

దాంతో బిగ్ బాస్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఇప్పుడు పల్లవి ప్రశాంత్‌( Pllavi prashanth ) కెప్టెన్ కాదు.ఈ పరిణామాలు తీవ్ర విమర్శలకు తెర తీస్తున్నాయి.బిగ్‌ బాస్ ఒక్క ఛాన్స్ ను పల్లవి ప్రశాంత్‌ కి ఇవ్వాల్సింది అంటూ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పల్లవి ప్రశాంత్‌ ను బలి పశువుగా మార్చారు అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bb Season, Biggboss, Biggboss Season, Nagarjuna, Tollywood-Movie

ఇదెక్కడి న్యాయం బాబోయ్ అంటూ కొందరు తీవ్ర స్థాయి లో బిగ్‌ బాస్( Biggboss ) నిర్వాహకులను మరియు బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ పై కూడా విమర్శలు చేస్తున్నారు.బిగ్‌ బాస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్‌ కి తాము మద్దతుగా నిలుస్తాం అన్నట్లుగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.పల్లవి ప్రశాంత్ విషయం లో బిగ్ బాస్ నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతూ ఉంటే కొందరు మాత్రం గొప్ప విషయం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంటే కంటెస్టెంట్స్ అంతా వ్యతిరేకంగా ఓటు వేశారు, అంతే కాకుండా బిగ్‌ బాస్‌ ఏమాత్రం దయ లేకుండా కెప్టెన్సీ తొలగించాడు.దాంతో పల్లవి ప్రశాంత్‌ ( Pllavi prashanth )కి సింపతీ కలిసి వస్తుందని అంటున్నారు.

అదే నిజం అయితే కచ్చితంగా టాప్ 5 లో రావడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube