కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా వంటి విభిన్న చిత్రాలు రూపొందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.ఈయన దర్శకత్వం లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా( Brahmotsava ) నిరాశ పరిచింది.
హీరోగా మహేష్ బాబు ని పెట్టుకుని కథ అక్కర్లేదు అనుకున్నాడేమో కానీ శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమా తో డిజాస్టర్ ను చవి చూడటం జరిగింది.ఆ దెబ్బ తో శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) కెరీర్ ఖతం అయినట్లే అని అంతా భావించారు.
కానీ శ్రీకాంత్ అడ్డాల తిరిగి పుంజుకున్నాడు.వెంకటేష్ తో నారాప్ప అనే సినిమా ను తీశాడు.
ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.ఆ వెంటనే కొత్త వారితో పెదకాపు అనే సినిమా ను మొదలు పెట్టాడు.

సినిమా షూటింగ్ సగం పూర్తి అయిన తర్వాత ఇది రెండు పార్ట్ లుగా వస్తే బాగుంటుందని భావించాడు.అందుకే తాజాగా పెదకాపు 1( Peddha Kapu 1 ) ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.ముందుగా అనుకున్న ప్రకారం అయితే వచ్చే ఏడాది సమ్మర్ లో పెదకాపు 2 ను విడుదల చేయాల్సి ఉంది.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండో భాగం రాకపోవచ్చు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పైగా ఒక యంగ్ హీరో కు శ్రీకాంత్ అడ్డాల కథ చెప్పాడని.త్వరలోనే ఆ హీరో నుంచి క్లారిటీ వస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి.

ఒక వేళ ఆ హీరో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే తప్పకుండా వచ్చే ఏడాది లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేంత ఉత్సాహంగా శ్రీకాంత్ అడ్డాల కనిపిస్తున్నాడు.ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ఏమాత్రం ఆశా జనకంగా లేదు.కనుక ఆ హీరో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.ఒక వేళ శ్రీకాంత్ అడ్డాలకు ఆ హీరో ఓకే చెప్తే గొప్ప విషయమే.
ఏ విషయం అయినది రెండు మూడు వారాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.







