ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో ర‌గ‌డ‌

ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో ర‌గ‌డ కొన‌సాగుతోంది.ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టేందుకు ప్ర‌భుత్వం స‌వ‌ర‌ణ బిల్లు రూపొందించింది.

ఈ క్ర‌మంలో పేరు తొల‌గింపుపై టీడీపీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తుంది.స్పీక‌ర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు.

దీంతో బిల్లు పెట్టిన‌ప్పుడు అభిప్రాయం చెప్పాల‌ని టీడీపీ స‌భ్యుల‌కు స్పీక‌ర్ త‌మ్మినేని సూచించారు.ఈ నేప‌థ్యంలో స్పందించిన మంత్రి అంబ‌టి మాట్లాడుతూ బుచ్చ‌య్య చౌద‌రి ఒక్క‌రికే ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హ‌త ఉంద‌ని పేర్కొన్నారు.

టీడీపీలోని మిగ‌తా వారంతా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారేన‌ని ఆరోపించారు.చంద్ర‌బాబుకు కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హ‌త లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Advertisement
తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!

తాజా వార్తలు