వరుస సభలతో దూకుడుగా కాంగ్రెస్... అసలు వ్యూహం ఇదే?

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి.రేవంత్ పీసీసీ చీఫ్ గా ఎంపిక కాకముందు ఏ మాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్ ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్తోంది.

కేసీఆర్ టార్గెట్ గా పదునైన విమర్శలతో దండోరాల పేరిట ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత నియోజకవర్గమైన గజ్వేల్ లో కాంగ్రెస్ సభ నిర్వహించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్శించారు.

అయితే వరుస సభలు నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటని ఒక్కసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పై ఇప్పటి వరకు ప్రజల్లో పెద్దగా ఆశలు లేవు.

ఏదో ఒక రూపములో ప్రజల్లో నిలవకపోతే ప్రజలలో కాంగ్రెస్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది, అంతేకాక కార్యకర్తలకు కూడా పోరాటపటిమ తగ్గి క్షేత్ర స్థాయిలో అధికార పార్టీ నాయకులతో పోటీ పడని పరిస్థితి నెలకొంటుంది.ఇది కాంగ్రెస్ కు చాలా వరకు ప్రమాదకరం.అయితే ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో అధికార పార్టీపై పోరాటం చేయక ప్రజల్లో కొంత కనుమరుగయిందన్న మాట వాస్తవం.

Advertisement

అందుకే ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.అందుకే ఒకప్పటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఓటమికి ఏవైతే కారణం అయ్యాయో, ఆ తప్పులు మరల జరగకుండా జాగ్రత్త పడుతున్నారట.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు