కిక్, రేసుగుర్రం వంటి సూపర్ డూపర్ సక్సెస్ లను సొంతం చేసుకున్న దర్శకుడు సురేందర్రెడ్డి( Surender Reddy ) గత చిత్రం మెగాస్టార్ చిరంజీవి తో రూపొందించి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కమర్షియల్ గా కాస్త నిరాశ పరచినా కూడా సురేందర్ రెడ్డి కి మంచి పేరు ని తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు.
కానీ కొన్ని కారణాల వల్ల చిరంజీవి సినిమా సైరా నరసింహారెడ్డి తర్వాత గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు అక్కినేని అఖిల్ తో ఏజెంట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఏజెంట్ సినిమా( Agent ) కు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించాడు.మొదట అనిల్ సంకర ( Anil Sunkara )మాత్రమే ఈ సినిమా కు నిర్మాత కానీ, మధ్య లో బడ్జెట్ భారీగా పెరగడంతో చేసేది లేక దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు.సహ నిర్మాతగా సురేందర్ రెడ్డి కాస్త ఎక్కువగానే ఖర్చు చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇన్నాళ్లు సంపాదించింది సురేందర్ రెడ్డి అందులో పెట్టేసాడని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.సురేందర్ రెడ్డి దర్శకుడిగా మరో సినిమా చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి.కానీ ఆయన నిర్మాతగా కోల్పోయిన మొత్తం ఇప్పట్లో తిరిగి సంపాదించుకునే పరిస్థితి లేదు అంటూ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ స్థాయిలో సురేందర్ రెడ్డి ఆస్తులను అమ్ముకొని మరి సినిమా కు బడ్జెట్ పెట్టాడని.సినిమా కనీసం 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ కూడా నమోదు చేయలేక పోతుండటంతో ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం అవుతుంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఏజెంట్ సినిమా అన్ని రకాలుగా దర్శకుడు సురేందర్ రెడ్డి కి నిరాశ కలిగించిందని చెప్పాలి.
అయితే సురేందర్ రెడ్డి మరో సూపర్ హిట్ సొంతం చేసుకుంటే ప్రస్తుత పరిస్థితిలన్నింటి నుండి కూడా అతను బయటపడే అవకాశాలు లేకపోలేదు.

ఏజెంట్ సినిమా నిరాశ పర్చినా కూడా సురేందర్ రెడ్డిని నమ్మేందుకు యంగ్ హీరోలు చాలా మంది సిద్ధంగా ఉన్నారు.ఆయన స్టైలిష్ టేకింగ్ అందరికీ నచ్చుతుంది.ఆయన సినిమాలు సక్సెస్ అవ్వకుండా ప్రేక్షకుల్లో కొంత మందిని సర్ప్రైజ్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.
అందుకే ఆయనతో సినిమాలకు యంగ్ హీరోలు రెడీ అయ్యే అవకాశం ఉంది.సూరి వెంటనే కథ రెడీ చేస్తే ఇదే ఏడాది కొత్త సినిమా మొదలు పెట్టే అవకాశాలు లేకపోలేదు.







