సిల్క్ స్మిత (Silk Smitha)ఒకానొక సమయంలో ఇండస్ట్రీని తన డాన్స్ తో, తన అంద చందాలతో, మత్తు కళ్ళతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇలా ఒకానొక సమయంలో సిల్క్ స్మితను చూడటం కోసం సినిమాలకు వెళ్లేవారు అంటే ఆమెకు ఎలాంటి క్రేజ్ ఉండేదో అర్థమవుతుంది.
ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె మరణించడం ఇండస్ట్రీకి పెద్ద షాక్ అని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్నటువంటి సిల్క్ స్మిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఈమె మరణం పై ఎన్నో సందేహాలు ఉన్నాయి ఇప్పటికీ ఈమె మరణానికి గల కారణం మాత్రం తెలియడం లేదు.

అయితే సిల్క్ స్మిత చనిపోవడానికి ముందు రాసినటువంటి ఒక లెటర్(Letter) ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఇందులో ఆమె టార్చర్ భరించలేకపోతున్నానని నన్ను మోసం చేశారు అంటూ ఎంతో ఆవేదన చెంది లెటర్ రాసినట్టు తెలుస్తుంది.ఇందులో సిల్క్ స్మిత తన బాధ మొత్తం బయటపెట్టారు నా ఏడవ ఏటా నుంచి పొట్టకూటి కోసం కష్టపడుతున్నాను.నాకంటూ ఎవరూ లేరు నన్ను ప్రేమించే వారు లేరు బాబు ఒక్కడే నన్ను అర్థం చేసుకున్నారు.
మిగతా వాళ్ళందరూ నా సొమ్ము తిని నన్ను మోసం చేశారు.రాము,రాధాకృష్ణ ఇద్దరు నన్ను మోసం చేశారు దేవుడనే వాడే ఉంటే వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ఈ లెటర్లో రాశారు.

ఐదు సంవత్సరాల క్రితం ఒకడు నాకు జీవితం ఇస్తానని నన్ను మోసం చేశాడు.ప్రతి ఒక్కడు నా రెక్కల కష్టం తిని నన్ను మోసం చేసిన వాళ్లే.బాబు తప్ప అందరూ నన్ను మోసం చేశారు.ప్రతిరోజు ఈ టార్చర్ భరించాను… ఈ బాధను భరించలేకపోతున్నాను అంటూ ఈమె తన ఆవేదన మొత్తం లేఖ రూపంలో రాశారు.
అయితే ఈ లెటర్ లో ఆమె ఎక్కడ ఆత్మహత్య(Sucide) చేసుకోబోతున్నానని తెలియజేయలేదు.అయితే ఈ లేఖ ఆధారంగా రాధాకృష్ణను అరెస్టు చేసినప్పటికీ ఈమె మరణానికి గల కారణాలు మాత్రం బయట పడలేదు.
ఇలా సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ గానే మారిందని చెప్పాలి.







