మరో స్టార్ హీరోతో ఛాన్స్ అందుకున్న త్రిష.. అమ్మడి లక్ మాములుగా లేదుగా!

After Vijay Trisha To Romance Ajith, Thalapathy Vijay, Ajith Kumar, Trisha , Kollywood, Tollywood, Lokesh Kanagaraj, Ponniyin Selvan , VidaaMuyarchi , LEO Movie, Trisha Krishnan

టాలీవుడ్ తెరపై ఒక దశాబ్దం పైగానే టాప్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష( Trisha ) కొన్ని రోజులుగా తెలుగు తెరకు దూరం అయ్యి మొత్తానికి తమిళ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపొయింది.అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఇంకా రాణిస్తూనే ఉంది.

 After Vijay Trisha To Romance Ajith, Thalapathy Vijay, Ajith Kumar, Trisha , Ko-TeluguStop.com

ఈ మధ్య ఈ అమ్మడికి లక్ బాగా కలిసి వచ్చింది.వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

ఇటీవలే పొన్నియన్ సెల్వన్ రెండు పార్టులతో ( Ponniyin Selvan )పలకరించి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఈ సినిమా తర్వాత మళ్ళీ స్టార్ హీరోల సరసన అవకాశం అందుకుంటూ బిజీగా మారిపోయింది.ప్రస్తుతం త్రిష ఇళయ దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న లియో సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

Telugu Vijaytrisha, Ajith Kumar, Kollywood, Leo, Ponniyin Selvan, Trisha Krishna

విజయ్, త్రిష( Vijay ) దాదాపు 14 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు.దీంతో ఈ జోడిపై మరింత ఆసక్తి పెరిగింది.కాగా ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.2023 అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.ఇక ఈ సినిమాలో నటిస్తున్న ఈ భామకు మరో తమిళ్ స్టార్ హీరో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది.

Telugu Vijaytrisha, Ajith Kumar, Kollywood, Leo, Ponniyin Selvan, Trisha Krishna

కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు.ఇటీవలే ‘తునివు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అజిత్ నెక్స్ట్ సినిమాను అప్పుడే అనౌన్స్ చేసాడు.మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ”విడా ముయర్చి” అనే సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాలోనే అజిత్ సరసన త్రిష అవకాశం కొట్టేసినట్టు సమాచారం.జూన్ లో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube