తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్ మార్చ్ పాదయాత్ర ఇవాళ జడ్చర్లకు చేరుకోనుంది.ఈ నేపథ్యంలో జడ్చర్ల డిగ్రీ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహించనుంది.
కాగా సభా వేదికకు రాజీవ్ గాంధీ సభా ప్రాంగణంగా నామకరణం చేశారు.అయితే భట్టి చేపట్టిన పీపుల్ మార్చ్ పాదయాత్ర ఇవాళ్టితో ఎనిమిది వందల కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది.
ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ప్రారంభంకానుండగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ మేరకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.