దివంగత హీరో నందమూరి తారక రామారావు( Sr NTR ) గురించి మనందరికీ తెలిసిందే.కేవలం హీరోగా మాత్రమే కాకుండా నటుడిగా విలన్ గా డైరెక్ట్ గా ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్రణ వేసుకున్నారు.
ఇకపోతే రామారావు నటించిన కొన్ని సినిమాల గురించి తాజాగా టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopalakrishna ) తెలిపారు.రామారావు అభిమానిగా ఆయనకు ఎంతో ఇష్టమైన సినిమాల గురించి తెలిపారు.
ఈ సందర్భంగా పరుచూరి మాట్లాడుతూ.ఆరోజుల్లో ఎన్టీఆర్, నాగేశ్వరావు ఇద్దరూ సాంఘిక చిత్రాల్లో నటించేవారు.
కన్యాశుల్కం( Kanyashulkam movie ) సినిమాతోనే తానేంటో ఎన్టీఆర్ నిరూపించుకున్నారు.ఆ తర్వాత వచ్చిన కలిసివుంటే కలదు సుఖం సినిమాలో ఆయన పోస్టర్ చూసి చాలా మంది అభిమానులు ఆ సినిమాకు వెళ్లాలనుకోలేదు.వాళ్లు ఎంతగానో అభిమానించే హీరో దివ్యాంగుడి పాత్రలో చూడలా అనుకున్నారు.కానీ ఆ సినిమా క్లైమాక్స్‌లో ప్రేక్షకులంతా ఈలలు వేశారు.ఆ చిత్రం ఎవరైనా చూడని వాళ్లుంటే ఎన్టీఆర్ నటన కోసమైనా కచ్చితంగా చూడాలి.అలాగే ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో రక్త సంబంధం( Raktha sambandham movie ) అద్భుతంగా ఉంటుంది.
అప్పటి వరకు ఆయన పక్కన హీరోయిన్గా చేసిన సావిత్రిగారు రక్తసంబంధం సినిమాలో ఆయనకు చెల్లెలిగా చేసి మెప్పించారు.
ఈ సినిమా 25 వారాల పాటు ఆడింది.అలాగే ఎన్టీఆర్ కెరీర్లో గుండమ్మ కథ( Gundamma katha movie ) మరో అద్భుతం.ఇప్పటి సినిమాలు చూసేవారంతా ఒక్కసారి గుండమ్మ కథ చూడాలి.
అందులో ఎన్టీఆర్ వేషధారణ ఆయన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటాయి అని చెప్పుకొచ్చారు పరుచూరి.అలాగే బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ ముసలివాడిగా కనిపించారు.
టీచర్ల కష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా జీవితకాలం గుర్తుంటుంది.పరుచూరి గోపాలకృష్ణ నటుడిగా, రచయితగా మనందరికీ సుపరిచితమే.