Tamannaah Bhatia : సంక్రాంతికి శృతిహాసన్.. ఇండిపెండెన్స్ డేకి తమన్నా.. సక్సెస్ అవుతారా?

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ( Shruti Haasan )గురించి మనందరికీ తెలిసిందే.

కాగా ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది ఆరంభంలో విడుదల అయినా వీరసింహారెడ్డి వీరయ్య సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya ) సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది.అలాగే వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు( Balayya Babu ) సరసన నటించింది.

ఈ రెండు సినిమాలలో హీరోయిన్ శృతిహాసన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

భారీ విజయాన్ని అందుకున్నాయి.

Advertisement

ఇలా వరుసగా ఇద్దరు అగ్ర హీరోలు సరసన నటించడంతో పాటు ఆ రెండు సినిమాలు విడుదల అయ్యి సూపర్ హిట్ కావడంతో శృతిహాసన్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.దీంతో శృతిహాసన్ కి ప్రస్తుతం వరుసగా అవకాశాలు ఉపయోగపడుతున్నాయి.అయితే సంక్రాంతికి శృతిహాసన్ రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందుకోగా ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది.

ఇండిపెండెన్స్ డే‌ స్పెషల్‌గా ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో ఇద్దరు అగ్రహీరోలతో కలిసి తమన్నా నటించిన చిత్రాలు విడుదల కానున్నాయి.వీటిలో ఒకటి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ జైలర్‌ సినిమా కాగా, మరొకటి మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌( Bhola Shankar ) సినిమా.

ఈ రెండు సినిమాలలో కూడా తమన్నా హీరోయిన్ గా నటించింది.నిజానికి తమన్నా సినీ కెరీర్‌ ముగిసిపోయిందంటూ జోరుగా ప్రచారం సాగింది.ఇలాంటి తరుణంలో ఆమెకు ఏకంగా ఇద్దరు అగ్ర హీరోలతో నటించే అవకాశం రావడంతో దీంతో ఒక్కసారిగా ఆమె ఫోకస్‌ లోకి వచ్చింది.

కాగా రజనీకాంత్‌తో నటించిన జైలర్( Jailer ) సినిమా ఆగస్ట్ 10న విడుదల కాబోతుండగా మెగాస్టార్ చిరంజీవితో నటించిన భోళాశంకర్ సినిమా ఆ మరుసటి రోజు అంటే ఆగస్ట్ 11న విడుదల కానుంది.మరి సంక్రాంతికి విడుదలైన ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

మరి ఈ రెండు సినిమాలు ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తాయి చూడాలి మరి.ఒకవేళ ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే తమన్నా మళ్ళీ ఫామ్ లోకి రావడం ఖాయం.

Advertisement

తాజా వార్తలు