శాకుంతలం హిట్ అయితే మరోటి రెడీ అట..!

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా చేసిన విషయం తెలిసిందే.దిల్ రాజు సమర్పించిన ఈ సినిమాను నీలిమ గుణ నిర్మించారు.

సమంతతో పాటుగా దేవ్ మోహన్ కూడా ఈ సినిమాలో నటించారు.ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేయగా ఈ ఈవెంట్ లో గుణశేఖర్ తన నెక్స్ట్ సినిమా గురించి ఒక హింట్ ఇచ్చేశాడు.

శాకుంతలం సినిమాకు దిల్ రాజు చేసిన హెల్ప్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేసిన గుణశేఖర్ అసలు ఆయన లేకపోతే ఈ సినిమా లేదని క్రెడిట్ మొత్తం దిల్ రాజుదే అని అన్నారు.ఇక నెక్స్ట్ సినిమా కూడా ఆయనతోనే అని హింట్ ఇచ్చారు గుణశేఖర్.

అయితే ప్రస్తుతం శాకుంతలం గురించి మాత్రమే మాట్లాడాలి అంటూ ఆడియన్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం పోగొట్టుకోనని.బాగా వచ్చే వరకు చెక్కుతూనే ఉన్నామని అన్నారు గుణశేఖర్.

Advertisement

శాకుంతలం హిట్ పడితే మాత్రం గుణశేఖర్ కి వెంటనే ఓ సినిమా లైన్ లో ఉన్నట్టే లెక్క.సమంత ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని చూసి ఆమె ఒక సూపర్ స్టార్ అనేశారు గుణశేఖర్.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు