క్రియేటివ్‌ డైరెక్టర్ కృష్ణవంశీ గొప్ప దర్శకుడే.. కానీ అసలు సమస్య అదే!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ( Krishnavamsi ) దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ( Rangamarthanda ) సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.కానీ కలెక్షన్స్ మాత్రం నామమాత్రంగానే వస్తున్నాయి.

 After Rangamarthanda Movie Krishnavamshi Next Project Update , Krishnavamshi , R-TeluguStop.com

పెద్ద ఎత్తున అంచనాల నడుమ విడుదల అయిన రంగమార్తాండ సినిమాను ఎక్కువ శాతం ఇండస్ట్రీ వర్గాల వారు మరియు పెద్దలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.రెగ్యులర్ కమర్షియల్ ప్రేక్షకులు మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

ఎప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయితే అప్పుడు చూడాలని కోరుకుంటున్నారు కానీ థియేటర్ కు వెళ్లి చూడాలి అనేంత ఆసక్తితో ఎవరు లేరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఇక క్రియేటివ్‌ డైరెక్టర్ కృష్ణవంశీ గతంలో అనుకున్న పలు సినిమాలు క్యాన్సిల్‌ అయ్యాయి.

రంగమార్తాండ సినిమా సక్సెస్ అయితే తప్పకుండా ఆ సినిమా లను మళ్లీ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి.కానీ కృష్ణవంశీ ఇప్పటి వరకు తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

కృష్ణవంశీ ఒక గొప్ప దర్శకుడు అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు.కానీ ఆయన సినిమాలు రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల మాదిరిగా ఉండటం లేదు అనే అభిప్రాయం చాలా మంది లో వ్యక్తం అవుతోంది.సోషల్‌ మీడియాలో కృష్ణ వంశీ గురించి గొప్పగా చెప్పే వారు కూడా రంగమార్తాండ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించరు.కారణం ఏంటీ అంటే రంగ మార్తాండ సినిమా ఒక రెగ్యులర్ కమర్షియల్‌ సినిమా కాదు కనుక.

ఆ సినిమాను జనాలు పెద్దగా ఆసక్తి చూపించరు కనుక అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కృష్ణవంశీ మంచి దర్శకుడే అయినా కమర్షియల్‌ సినిమాలు తీయడంలో ఆయన మునుపటి జోరు చూపించడంలో విఫలం అవుతున్నాడు.

క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడైతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయగలడో అప్పుడే మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube