మహానటి.ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కీర్తి సురేష్ ( Keerthy Suresh ).ఈమె కెరీర్ గురించి చెప్పాలంటే మహానటి నుండి మహానటి తర్వాత అనే చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమా కంటే ముందు ఈమె నటనలో ఆకట్టుకున్న సినిమాలు లేవు అనే చెప్పాలి.
అయితే ఎప్పుడైతే మహానటి ( Mahanati ) సినిమాలో నటించిందో ఈమె కెరీర్ పరంగా బెస్ట్ సినిమాలో నటించింది అనే కామెంట్స్ వినిపించాయి.
ఈ సినిమా ఈమెకు ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం తెచ్చిపెట్టింది.
నేను శైలజ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అందం, అభినయంతో ఆకట్టుకుంది.ఆ తర్వాత మహానటి సక్సెస్ తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
అప్పటి నుండి స్టార్ హీరోలతో నటిస్తూ మెప్పిస్తున్న కీర్తి సురేష్ ప్రజెంట్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.
న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దసరా’‘(Dasara) .రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసాడు.సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని (Nani), కీర్తి ఇద్దరు కూడా డీ గ్లామర్ పాత్రలో నటించారు.

నాని ధరణి పాత్రలో నటించగా.కీర్తి ‘వెన్నెల’ ( Vennala) పాత్రలో నటించింది.ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కీర్తి కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.

తాజాగా ఈమె శనివారపు సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న వెన్నెల అంటూ సోషల్ మీడియాలో ఒక పిక్ షేర్ చేసింది.మాస్ చీరకట్టుతో ఆకట్టుకుంటున్న కీర్తి ఈ పిక్ నెట్టింట వైరల్ అయ్యింది.దీంతో ఈమె ఫ్యాన్స్ ఈ పిక్ ను లైక్ చేయడమే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా కీర్తి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు.







