పుష్ప 2 తర్వాత బన్నీ ప్లాన్ అదేనా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు.పుష్ప పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ అందుకోగా పుష్ప పార్ట్ 2తో మరిన్ని రికార్డులపై గురి పెట్టాడు.

 After Pushpa 2 What Is The Plan Of Allu Arjun ,  Allu Arjun , Bunny ,  Kollywood-TeluguStop.com

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఇంకా ఫైనల్ అవలేదు.అసలైతే వేణు శ్రీరాం తో ఐకాన్ సినిమా దాదాపు అటకెక్కినట్టే అంటున్నారు.

అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మురుగదాస్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని చెబుతున్నారు.తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మురుగదాస్ తెలుగులో డైరెక్ట్ గా చిరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ సినిమాలు చేశాడు.

ఆ రెండు సినిమాలు నిరాశపరచాయి.రజిని దర్బార్ తర్వాత తన నెక్స్ట్ సినిమా ప్రకటించని మురుగదాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.

అంతకుముందు చరణ్ తో సినిమా అనుకోగా అది ఎందుకో వర్క్ అవుట్ అవలేదు.ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేసే ఆలోచనల్లో ఉన్నారట.పుష్ప పార్ట్ 2 తర్వాత అల్లు అర్జున్ మురుగదాస్ తో సినిమా చేస్తాడా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube