మెగా ఇంట పెళ్లి బాజాలు మోగనుండడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ఘనంగా నటి లావణ్య త్రిపాఠిని(Lavanya Tripati) నిశ్చితార్థం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతుందన్న విషయం తెలియడంతో మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేవు.ఇక వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9వ తేదీ మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.ఈ విధంగా నిశ్చితార్థం సింపుల్ గా జరిగిన పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరగబోతుంది అని తెలుస్తుంది.

ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో చాలామంది అభిమానులు వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫాలో అవుతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.మెగా కుటుంబానికి కోడలుగా వచ్చిన వారందరూ కూడా బిజినెస్ రంగానికి లేదా ఇతర రంగాలకు చెందిన వారే.మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, నాగబాబు భార్య పద్మజ అల్లు అరవింద్ భార్య గీత, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, చరణ్ భార్య ఉపాసన వీరందరూ కూడా సినిమా రంగానికి చెందిన వారు కాదు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం నటి రేణు దేశాయ్(Renudesai) ను బద్రి సినిమా(Badri Movie) సమయంలో ప్రేమించి తనని పెళ్లి చేసుకున్నారు.ఇక రేణు దేశాయ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి కావడం విశేషం అయితే పెళ్లి విషయంలో వరుణ్ తేజ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యారని ఈయన కూడా మిస్టర్ సినిమా(Mister Movie) సమయంలో లావణ్య త్రిపాఠిన ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.ఇలా వరుణ్ తేజ్ సినిమాల విషయంలో కాకుండా పెళ్లి విషయంలో కూడా తన బాబాయ్ ని ఫాలో అయ్యారని అయితే తన బాబాయ్ మాదిరిగానే విడాకులు(Divorce) తీసుకోకూడదు అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ను వివాహం చేసుకొని కొంతకాలం తర్వాత తనకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.







