చంద్రబాబు అరెస్ట్.. జనాల్లోకి టీడీపీ ! 

టిడిపి అధినేత చంద్రబాబు ను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం( AP Skill Development Scam ) లో అరెస్టు చేయడం,  ఆయనను రాజమండ్రి జైలుకు తరలించిన నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏమిటనేది ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది.

ఈ మేరకు జనాల్లోకి వెళ్లి వారికి ఈ విషయాన్ని చెప్పాలని నిర్ణయించుకుంది.

చంద్రబాబుపై సిఐడి రిమాండ్ రిపోర్టు( Chandrababu Remand Report )లో పొందుపరిచిన అంశాలన్నీ అసత్యలేనని,  సిఐడి చేసిన ఆరోపణలో నిజం లేదని నిరూపించాలని,  దీనిని జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది.

ఈ మేరకు ప్రత్యేక బుక్ లెట్లతో వివరణాత్మకంగా అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ( TDP ) నిర్ణయించుకుంది.ఏపీలో ఎన్నికల సమయం కూడా దగ్గరకు వస్తుండడం, ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో జనాల్లో తిరుగుతూ, చంద్రబాబు ను అరెస్ట్( Chandrababu Arrest ) చేసిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున సానుభూతి సంపాదించాలని, తద్వారా వాటిని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలి అనే ఆలోచనలో ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.చంద్రబాబు చుట్టూ కుట్ర జరుగుతోందని , ప్రస్తుతం ఆయన నమోదైన కేసుల గురించి ప్రజలకు వివరిస్తే వారి నుంచి మద్దతు లభిస్తుందని టిడిపి కీలక నిర్ణయం తీసుకుంది .చంద్రబాబును అక్రమ అరెస్టులు చేస్తూ,  కేసులు నమోదు చేస్తున్న తీరును ప్రజలకు వివరించగలిగితే మంచి ఫలితాలు వస్తాయని టిడిపి అంచనా వేస్తోంది.

అంతేకాకుండా గతంలో జగన్ అక్రమాస్తుల కేసు( YS Jagan Illegal Assets Case )లో జైలుపాలైనప్పుడు జగన్ తల్లి విజయమ్మ , సోదరి షర్మిల జనాల్లోకి వచ్చి జగన్ పై సానుభూతి పెరిగే విధంగా రాష్ట్ర పర్యటనలు చేశారని,  అదే మాదిరిగా చంద్రబాబు భార్య భువనేశ్వరి,  కోడలు బ్రాహ్మ ణి( Nara Brahmani ) కూడా రంగంలోకి దింపి రాష్ట్ర వ్యాప్తంగా  వారితో పర్యటనలు చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది.ఏది ఏమైనా చంద్రబాబు అరెస్ట్ తో టిడిపి పై జనాల్లో సానుభూతి పెంచుకునే విధంగా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అర్థమవుతుంది.

Advertisement
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

తాజా వార్తలు