కరోనా కట్టడి కోసం ఆఫ్రికన్ హెర్బల్ మెడిసిన్!

దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఎప్పుడు, ఎక్కడ, ఎలా సోకుతుందో తెలియని ఈ వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తోంది.

కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ప్రజల్లో భయాందోళనను మరింత పెంచుతోంది.కరోనాకు సమర్థవంతంగా పని చేసే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేయడానికి చాలా సమయం పడుతుందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.దీంతో ఆఫ్రికన్ దేశాలు కరోనా వ్యాక్సిన్ పై ఆధారపడకుండా మూలికా ఔషధాన్ని తయారు చేయడం వైపు అడుగులు వేస్తున్నాయి.

హెర్బల్ మెడిసిన్ కరోనాపై పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతుందని.మడగాస్కర్ ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలీనా చెబుతున్నారు.

Advertisement

ఆండ్రీ కొన్ని నెలల క్రితమే అక్కడి పరిశోధకులు తయారు చేసిన మూలికా ఔషధాన్ని తీసుకున్నారు.ప్రజలు కూడా ఆ మూలికా ఔషధం తీసుకోవాలని. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో మూలికా వైద్యం ద్వారా మాత్రమే కరోనా మహామ్మారిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు.

మలేరియా చికిత్స కోసం వినియోగించే అర్టెమిసియా జాతికి చెందిన మొక్క నుంచి ఈ ఔషధాన్ని తయారు చేశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఆఫ్రికన్ హెర్బల్ మెడిసిన్ కరోనా రోగులపై పెద్దగా ప్రభావం చూపదని చెబుతోంది.

అయితే ఇప్పటికే రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకున్న ఈ ఆఫ్రికన్ హెర్బల్ మెడిసిన్ కరోనా రోగులపై మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వసించకపోయినా మడగాస్కర్ తో పాటు ఇతర దేశాల ప్రజలు ఆఫ్రికన్ హెర్బల్ మెడిసిన్ అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు