టీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితి ఉంది.ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దింపానే ఉద్దేశ్యం తో ప్రతిపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో టీఆర్ఎస్ విఫలం కావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రభుత్వ పధకాలపై ప్రజల్లో వ్యతిరేకత అనేది లేకున్నా రాజకీయ పరమైన వ్యతిరేక ప్రచారం ఒక్కసారిగా కెసీఆర్ కు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేలా చేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇప్పటివరకైతే కెసీఆర్ ఈ రకమైన పరిస్థితులపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకున్నా రానున్న రోజుల్లో ఖచ్చితంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది.
అంతేకాక ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మరో కొత్త పధకం అనేది ప్రకటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఎలా రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగడంతో రానున్న రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయని ఇక కెసీఆర్ మరింతగా బీజేపీ విమర్శలను తిప్పికొడితే కానీ పరిస్థితులు చక్కదిద్దబడే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇంకా ఆలస్యం చేస్తే ప్రజల్లో ఇక మొండిగా కెసీఆర్ అంటే బలమైన వ్యతిరేక ముద్ర అనేది పడే అవకాశం కనిపిస్తోంది.
మరి కెసీఆర్ ప్రశాంత్ కిషోర్ సలహాల వైపు మొగ్గు చూపించి దిద్దుబాటు చర్యలకు దిగుతాడా లేదా అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేక పోయినా కెసీఆర్ తీసుకునే నిర్ణయాలను బట్టి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.







