చంద్రబాబు ఎస్ఎల్పీపై విచారణకు విరామం

టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు విరామం ఇచ్చింది.ఈ మేరకు లంచ్ బ్రేక్ తరువాత విచారణ చేపట్టనుంది.

విచారణలో భాగంగా చంద్రబాబు తరపున న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు ముగిశాయి.దీంతో సీఐడీ తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు.ఈ క్రమంలోనే 2018 పీసీ చట్ట సవరణకు ముందే నేరాలు జరిగాయన్నారు.2021లో ఎఫ్ఐఆర్ నమోదైందన్న రోహత్గి రాజకీయ ప్రతికార కేసు కాదని కోర్టుకు తెలిపారు.2023తో కేసు బయటకు వచ్చినప్పుడు నిందితుడిగా చేర్చబడ్డారని పేర్కొన్నారు.కాగా 2018లోనే కేసు విచారణ ప్రారంభమైందని తెలిపారు.2018 మే నెలలోనే మెమో దాఖలు చేశారన్న ముకుల్ రోహత్గి మెమోకి సంబంధించిన డాక్యుమెంట్స్ సుప్రీంకోర్టుకు సమర్పించారు.హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే అన్ని పత్రాలు ఇచ్చామన్నారు.డిసెంబర్ 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని కోర్టుకు వెల్లడించారు.2018కి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17ఏ వర్తించదన్న ముకుల్ రోహత్గి 2018 జూలై తరువాత నేరాలకు మాత్రమే సెక్షన్ 17ఏ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..

తాజా వార్తలు