సూపర్ స్టార్ కృష్ణ - అడవి శేష్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా!

Adivi Sesh Superstar Krishna Combination Movie Cancelled, Adivi Sesh,Superstar Krishna,Mosagallaku Mosagadu,Gunturu Karam,

టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్( Crazy Combinations ) సెట్స్ దాకా వచ్చి ఆగిపోయినవి చాలా ఉన్నాయి.ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈ విషయం తెలుసుకొని అయ్యో ఎంత మంచి కాంబినేషన్ మిస్ అయ్యింది అని బాధపడుతూ ఉంటాము, అలాంటి క్రేజీ సినిమా ఒకటి తెలుగు ఆడియన్స్ చూసే అదృష్టం ని మిస్ అయ్యారని రీసెంట్ గా సోషల్ మీడియా లో ప్రచారమైన ఒక వార్త ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది.

 Adivi Sesh Superstar Krishna Combination Movie Cancelled, Adivi Sesh,superstar K-TeluguStop.com

ఇక అసలు విషయానికి ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్( Adivisesh ) ని హీరో గా ఒక మెట్టు పైకి ఎక్కించిన సినిమా ‘గూడాచారి’.( Goodachari ) అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సంచలన విజయం సాధించింది.

ఈ చిత్రం తర్వాతే అడవి శేష్ అంటే స్పై జానర్ సినిమాలకు పెట్టింది పేరు లాంటి వాడని అందరికీ అర్థం అయ్యిది, ఆయన కెరీర్ లో ల్యాండ్ మార్కుగా నిల్చిన ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Telugu Adivi Sesh, Gunturu Karam, Krishna-Movie

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ వీడియో ని కూడా కొంతకాలం క్రితం విడుదల చేసారు.అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబందించి ఒక క్రేజీ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అసలు విషయానికి వస్తే ఈ సినిమా లో ఒక పాత్ర కోసం సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) ని అడిగారట మూవీ టీం.అప్పట్లో ఆయన ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ సినిమాల్లో నటించకూడదు అనే నిర్ణయం తీసుకున్న కారణంగా ఈ చిత్రం లో నటించలేనని చెప్పేశాడట,కానీ కేవలం రెండు రోజుల కాల్ షీట్స్ మాత్రమే అవసరం ఉంటుందని, కూర్చొని డైలాగ్స్ పలికే పాత్ర మాత్రమే కానీ, ఎలాంటి ఒత్తిడి లేని పాత్ర అని కృష్ణ ని ఎంతో రిక్వెస్ట్ గా బ్రతిమిలాడితే ఓకే చెప్పాడట.ఇంతలోపే ఆయన పెద్ద కొడుకు చనిపోవడం, భార్య ఇందిరా దేవి చనిపోవడం తో కృష్ణ గారి మానసిక స్థితి బాగా దెబ్బ తినింది.

Telugu Adivi Sesh, Gunturu Karam, Krishna-Movie

అయినా మాట ఇచ్చాను కాబట్టి కచ్చితంగా మీరు అడిగిన రెండు రోజుల కాల్ షీట్స్ ఇస్తానని మూవీ టీం కి చెప్పాడట, కానీ ఈలోపే ఆయన తిరిగిరాని లోకాలకు ప్రయాణమయ్యాడు.దాంతో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు చివరిసారిగా వెండితెర మీద తమ అభిమాన హీరో ని చూసుకునే అదృష్టాన్ని కోల్పోయారు.మరో మూడు రోజుల్లో ఆయన పుట్టినరోజు రాబోతుంది, ఈ సందర్భంగా ఫ్యాన్స్ సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన సెన్సషనల్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు'( Mosagallaku Mosagadu ) ని 4K టెక్నాలజీ కి రీ స్టోర్ చేసి గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు.ఈ సినిమాతో పాటుగా మహేష్ బాబు కొత్త సినిమా ‘గుంటూరు కారం'( Gunturu Karam ) చిత్రం టీజర్ ని కూడా అటాచ్ చేస్తున్నారట.

సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు తమకి ఇష్టమైన థియేటర్స్ లో ‘మోసగాళ్లకు మోసగాడు’ చూసి మనస్ఫూర్తిగా తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube